Share News

New York: అమెరికాలో మరో 8 భారత కాన్సులర్‌ కేంద్రాలు

ABN , Publish Date - Aug 03 , 2025 | 06:07 AM

అమెరికా వ్యాప్తంగా కొత్తగా 8 ఇండియా కాన్సులర్‌ అప్లికేషన్‌ సెంటర్ల(ఐసీఏసీ)ను భారత్‌ తెరిచింది. డాలస్‌, బోస్టన్‌, కొలంబస్‌, డెట్రాయిట్‌, ఎడిసన్‌, ఒర్లాండో, రాలీ, శాన్‌జోస్‌లలో ఏర్పాటు....

New York: అమెరికాలో మరో 8 భారత కాన్సులర్‌ కేంద్రాలు

  • డాల్‌సలో ఏర్పాటుపై ఐఏఎఫ్‌సీ అధ్యక్షుడు ప్రసాద్‌ హర్షం

న్యూయార్క్‌, ఆగస్టు 2: అమెరికా వ్యాప్తంగా కొత్తగా 8 ఇండియా కాన్సులర్‌ అప్లికేషన్‌ సెంటర్ల(ఐసీఏసీ)ను భారత్‌ తెరిచింది. డాలస్‌, బోస్టన్‌, కొలంబస్‌, డెట్రాయిట్‌, ఎడిసన్‌, ఒర్లాండో, రాలీ, శాన్‌జోస్‌లలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను అమెరికాలోని భారత రాయబారి వినయ్‌ క్వాట్రా శుక్రవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే లాస్‌ఏంజెలిస్‌లో మరో కేంద్రాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ‘అమెరికాలో ఉంటున్న 50 లక్షలకు పైగా ప్రవాస భారతీయుల కోసం మా సేవలను మరింత విస్తరిస్తున్నాం. పాస్‌పోర్టు, వీసా, జనన/వివాహ ధ్రువీకరణ పత్రం, ఓవర్సీస్‌ సిటిజన్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ), సరెండర్‌ సర్టిఫికెట్‌, పోలీసు క్లియరెన్స్‌ సహా అన్ని సేవలను ఈ కాన్సులర్‌ కేంద్రాల ద్వారా పొందవచ్చు’ అని వెల్లడించారు. డాల్‌సలో కాన్సులర్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఇండియన్‌ అమెరికన్‌ ఫ్రెండ్షిప్‌ కౌన్సిల్‌ (ఐఏఎ్‌ఫసీ) అధ్యక్షుడు ప్రసాద్‌ తోటకూర హర్షం వ్యక్తం చేశారు. కాగా, కొత్త వాటితో కలిపి అమెరికాలోని భారత కాన్సులర్‌ కేంద్రాల సంఖ్య 17కు పెరిగింది.

Updated Date - Aug 03 , 2025 | 06:09 AM