Rs.63,000 Crore Deal: రూ.63వేల కోట్ల డీల్.. మన నేవీకి తిరుగులేదిక
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:53 PM
ఇండియా నేవీ కోసం 26 రాఫెల్-ఎం జెట్‌లు సిద్ధం కాబోతున్నాయి. దీనికి సంబంధించి ఫ్రాన్స్‌తో రూ.63,000 కోట్ల ఒప్పందంపై సంతకాలు ఇవాళ జరిగాయి.

Rafale-M Jets For Indian Navy: భారత నావికాదళం మరింత పటిష్టం కాబోతోంది. ఇందుకోసం ఇండియా భారీగా రూ. 63వేల కోట్ల రూపాయల డీల్ కుదర్చుకుంది. ఫ్రాన్స్ నుండి 26 రాఫెల్ M ఫైటర్ జెట్‌లను - అంటే మెరైన్ వేరియంట్‌లను - కొనుగోలు చేయడానికి రూ.63,000 కోట్ల ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఇది ఒక రికార్డ్ స్థాయి డీల్.
కొనుగోలు ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్.. భారత్‌కు 22 సింగిల్ సీటర్ జెట్‌లు, నాలుగు ట్రైనర్ల కోసం ట్విన్ సీటర్ జెట్స్ ఇవ్వబోతున్నాయి. వీటి డెలివరీ 2031 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఒప్పందంలో ఫ్లీట్ నిర్వహణ, లాజిస్టికల్ సపోర్ట్, సిబ్బంది శిక్షణ, ఆఫ్‌సెట్ బాధ్యతల కింద విడి భాగాల స్వదేశీ తయారీ కూడా ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. ఈ డీల్ 'ఆత్మనిర్భర్ భారత్' చొరవకు సూచికగా చెబుతున్నారు.
కాగా, ప్రపంచ యుద్ధ రంగంలో రాఫెల్ M యుద్ధ విమానాలు అత్యంత అధునాతనమైనవి. నావికా యుద్ధ విమానాలలో వీటికి తిరుగులేని ఆధిపత్యం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఒక్క ఫ్రెంచ్ నావికాదళం వద్ద మాత్రమే ఈ జెట్ ఉంది. ఇవి సఫ్రాన్ గ్రూప్స్ యొక్క రీన్ఫోర్స్డ్ ల్యాండింగ్ గేర్‌లతో అమర్చబడి, క్యారియర్ అనుకూలమైనవి. ఫోల్డ్ చేసుకునేందుకు వీలుండే రెక్కలు, కఠినమైన పరిస్థితులను తట్టుకునే రీన్ఫోర్స్డ్ అండర్ క్యారేజ్, డెక్ ల్యాండింగ్ ఇంకా టెయిల్‌హుక్‌లను కూడా ఈ యుద్ధ విమానాలు కలిగి ఉంటాయి.
నేవీ కోసం సమీకరిస్తున్న ఈ సరికొత్త ఆయుధాలు విమాన వాహక నౌకలు INS విక్రాంత్, INS విక్రమాదిత్యపై మోహరిస్తారు. వీటివల్ల భారత సముద్ర శక్తి మరింత బలోపేతం అవుతుంది. హిందూ మహాసముద్రంలో ముప్పులను ఇవి సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. భారత్ చాలా కాలంగా ఉపయోగిస్తున్న MiG-29K విమానాలను ఇవి భర్తీ చేస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
మీ ఇంట్లో ఏపీ ఉందా.. అయితే ఈ జాగ్రర్తలు పాటించండి..
For More AP News and Telugu News