Nurse Sentenced To Life: 10 మంది పేషెంట్లను చంపిన నర్స్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..
ABN , Publish Date - Nov 07 , 2025 | 08:22 PM
జర్మనీకి చెందిన ఓ నర్సు 10 మంది పేషెంట్ల ప్రాణాలు తీసింది. మరో 27 మందిని చంపడానికి ప్రయత్నించి విఫలమైంది. ఆమె ఎందుకలా చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
రోగులకు సేవ చేసి వారి ప్రాణాలు కాపాడాల్సిన ఓ నర్స్ దారుణానికి ఒడిగట్టింది. ఏకంగా 10 మంది పేషెంట్లను చంపేసింది. మరో 27 మందిని చంపడానికి ప్రయత్నించింది. చివరకు పాపం పండి జైలు పాలైంది. తాజాగా, నర్సు కేసుపై విచారణ జరిపిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. జీవిత ఖైదు విధించింది. ఈ సంఘటన జర్మనీలో చోటుచేసుకుంది. ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. జర్మనీలోని ఆచెన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ స్థానికంగా ఉండే ఆస్పత్రిలో నర్సుగా పని చేసేది.
ఆమెకు తరచుగా నైట్ డ్యూటీలు పడుతూ ఉండేవి. ఆస్పత్రిలో పేషెంట్లు ఎక్కువగా ఉండటంతో పని చేయటం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. దీంతో ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. వృద్ధ పేషెంట్లకు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసింది. 2023 డిసెంబర్ నుంచి మే 2024 మధ్య కాలంలో 10 మంది పేషెంట్లను చంపేసింది. మరో 27 మందిని చంపటానికి ప్రయత్నించి విఫలమైంది. ఆమె నైట్ డ్యూటీలో ఉన్నప్పుడే ఎక్కువ మంది చనిపోతుండటంతో ఆస్పత్రి ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది.
పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. ఆమెను అరెస్ట్ చేశారు. అప్పటినుంచి కోర్టు ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. బుధవారం ఆచెన్ కోర్టు ఈ కేసుపై విచారణ జరిపి తుది తీర్పు వెలువరించింది. ఆమెను దోషిగా తేల్చింది. జీవిత ఖైదు విధించింది. దీనిపై కోర్టుకు సంబంధించిన అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘ఆమె 15 సంవత్సరాలకే విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ తీర్పుపై పైకోర్టును ఆశ్రయించవచ్చు’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
భవానీ దీక్షల విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు: దుర్గ గుడి చైర్మన్
ఆ పథకాన్ని ఎత్తేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్