Share News

Satanic Child Sacrifice: ఐదేళ్ల కొడుకును ఎడారిలో బలివ్వడానికి సిద్ధమైన తల్లిదండ్రులు..

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:20 PM

Satanic Child Sacrifice: ఎడారిలోకి వెళ్లడానికి 2023 చివర్లో ఓ కారు కొన్నారు. ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే, ఓ బంధువు కారణంగా వారి ప్లాన్ ఫెయిల్ అయింది. ఇద్దరూ జైలు అయ్యారు.

Satanic Child Sacrifice: ఐదేళ్ల కొడుకును ఎడారిలో బలివ్వడానికి సిద్ధమైన తల్లిదండ్రులు..
Satanic Child Sacrifice

సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా మూఢ నమ్మకాలు మాత్రం తగ్గటం లేదు. చదువుకున్న వాళ్లు.. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు కూడా అంధ విశ్వాసాలకు కట్టుబడిపోతున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన భార్యభర్తలు తమ కుమారుడికి దెయ్యం పట్టిందని నమ్మారు. పిల్లాడిని ఎడారిలో బలివ్వడానికి సిద్ధమయ్యారు. వాళ్లు ఆ దారుణానికి తెగబడకముందే పోలీసులకు దొరికిపోయారు. పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి ..


బోర్డియాక్స్ సిటీకి చెందిన ఫ్లోరియన్ లూనా, మేరీ లహాల్లే భార్యభర్తలు. వీరికి ఓ కొడుకు ఉన్నాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఓ మ్యూజిక్ స్కూలు నడుపుతున్నారు. స్థానికంగా వారికి మంచి గుర్తింపు ఉంది. ఉన్నత చదువులు, పేరు, ప్రఖ్యాతలు కలిగిన ఈ ఇద్దరు మూఢ నమ్మకాలవైపు మళ్లారు. క్షుద్ర శక్తులు ఉన్నాయని బాగా నమ్మేవారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల తమ కొడుక్కి దెయ్యం పట్టిందని వారు భావించారు. అతడ్ని మొరాకోలోని ఎడారిలోకి తీసుకెళ్లి బలివ్వాలని అనుకున్నారు.


ఎడారిలోకి వెళ్లడానికి 2023 చివర్లో ఓ కారు కొన్నారు. ప్రయాణానికి అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే, ఓ బంధువు కారణంగా వారి ప్లాన్ ఫెయిల్ అయింది. ఇద్దరూ జైలు అయ్యారు. ఎడారికి వెళ్లడానికి కొన్ని రోజుల ముందు ఫ్లోరియల్ లూనా తన బంధువుతో ‘నా కొడుకుకు దెయ్యం పట్టింది. వాడిని ఎడారికి తీసుకెళ్లి బలివ్వబోతున్నాం’అని చెప్పాడు. ఇదే విషయాన్ని బంధువు పోలీసులకు చెప్పాడు. అలర్ట్ అయిన పోలీసులు భార్యాభర్తల్ని అరెస్ట్ చేశారు. 2023నుంచి వాళ్లు జైలులోనే ఉంటున్నారు.


తాజాగా, కోర్టులో ఈ కేసుకు సంబంధించిన విచారణ జరిగింది. విచారణ సందర్భంగా దంపతుల తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఆ దంపతుల మీద వచ్చిన ఆరోపణలు అన్నీ అబద్ధం. ఈ ఆరోపణల్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. తన కొడుక్కు హాని చేయాలన్న ఉద్దేశ్యం అతడికి ఏ కోశాన లేదు. గతంలో ఆ దంపతులు మొరాకోలో రెండేళ్లు ఉన్నారు. ఇప్పుడు మళ్లీ వెళ్లాలని అనుకున్నారు. కొంత కాలం తర్వాత తిరిగి వద్దామని అనుకున్నారు. ఇంతలోనే వారిని తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేశారు’అని అంది. కోర్టు విచారణను వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తా..  ఎర్రబెల్లి మాస్ వార్నింగ్

పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు.. టెన్షన్ టెన్షన్

Updated Date - Jul 18 , 2025 | 12:29 PM