Share News

నువ్వసలు టీచర్‌వేనా.. పిల్లాడితో అవేం పాడు పనులు..

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:28 PM

Former US Teacher School Student: 2022, ఏప్రిల్ 1వ తేదీన ఇద్దరి మధ్యా రిలేషన్‌షిప్ మొదలైంది. దాదాపు రెండు సంవత్సరాలు ఆమె బాలుడితో సంబంధం పెట్టుకుంది. ఆ తర్వాత ఆ బాలుడు ట్విస్ట్ ఇచ్చాడు. ఈ విషయం గురించి అధికారులకు ఫిర్యాదు చేశాడు.

నువ్వసలు టీచర్‌వేనా.. పిల్లాడితో అవేం పాడు పనులు..
Former US Teacher

విద్యార్థులను సక్రమ మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే తప్పుదోవ పడుతున్నారు. శారీరక సుఖం కోసం దారుణమైన పనులు చేస్తున్నారు. అది కూడా తమ పిల్లల్లా భావించాల్సిన విద్యార్థులతో పాడు పనులు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా అమెరికాలో మహిళా టీచర్లు విచక్షణ మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. స్కూలు పిల్లలతో శారీరక సంబంధం పెట్టుకుంటున్నారు. జైలు పాలవుతున్నారు. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన 31 ఏళ్ల కార హెర్నాండెజ్ హోస్టన్ ఏరియాలోని రోనాల్డ్ తార్న్‌టన్ మిడిల్ స్కూల్లో టీచర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఉండేది. కార తను పాఠాలు చెప్పే ఓ బాలుడిపై కన్నేసింది. మాయమాటలు చెప్పి అతడ్ని లోబర్చుకుంది.


2022, ఏప్రిల్ 1వ తేదీన ఇద్దరి మధ్యా రిలేషన్‌షిప్ మొదలైంది. దాదాపు రెండు సంవత్సరాలు ఆమె బాలుడితో సంబంధం పెట్టుకుంది. ఏమైందో ఏమో తెలీదు కానీ, ఆ బాలుడు ఈ విషయాన్ని 2024 ఫిబ్రవరి నెలలో ఫోర్ట్ బెండ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్( ఐఎస్డీ)లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కారపై పోలీసు కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 14వ తేదీన ఆమెను అరెస్ట్ చేశారు. అప్పటినుంచి కేసు నడుస్తూ ఉంది. 2023, సెప్టెంబర్ నెలలో ఆమె స్కూలు నుంచి బయటకు వచ్చేసింది.


ప్రస్తుతం ఆమెపై రెండు ఛార్జులు నమోదయ్యాయి. ఒక్కో ఛార్జ్ కింద ఆమె 25 వేల డాలర్ల బాండు ఇవ్వాల్సి ఉంది. రెండు ఛార్జులకు కలిపి ఏకంగా 50 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఫాక్స్ న్యూస్ కథనం ప్రకారం ఆమె ఏప్రిల్ 28వ తేదీన కోర్టులో హాజరుకావాల్సి ఉంది. ఇక, ఈ సంఘటనపై ఫోర్ట్ బెండ్ ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్( ఐఎస్డీ) అధికారులు మాట్లాడుతూ.. ‘ ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేశాం. వెంటనే ఆమెను స్కూలు నుంచి బయటకు పంపేశాం. ఆమె మళ్లీ స్కూల్లో చేరే అవకాశం లేదు’ అని తెలిపారు.


ఇవి కూడా చదవండి

Husband And Wife: సజీవ సమాధికి సిద్ధమైన భార్యాభర్తలు.. కారణం ఏంటంటే..

విమానం హైజాక్ చేయాలనుకున్నాడు.. తోటి ప్రయాణికుడి చేతిలో చచ్చాడు..

Updated Date - Apr 18 , 2025 | 01:51 PM