ఫేక్ డాక్టర్‌తో ఇంట్లో ఆపరేషన్.. మహిళ ప్రాణం పాయే..
ABN , Publish Date - Apr 20 , 2025 | 11:17 AM
Fake Doctor Performs Surgery: కొన్నేళ్ల క్రితం ఆమె బట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంది. తాాజాగా, వాటిని తీయించుకోవడానికి ఓ ఫేక్ డాక్టర్‌తో ఇంట్లోనే ఆపరేషన్ చేయించుకుంది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. సరిగ్గా 13 రోజులకు చనిపోయింది.

ఫేక్ డాక్టర్‌తో ఇంట్లో ఆపరేషన్ చేయించుకోవటమే ఓ మహిళకు శాపంగా మారింది. ఆపరేషన్ జరిగిన కొన్ని రోజులకే తీవ్ర అస్వస్థతకు గురైంది. సరిగ్గా రెండు వారాలకు ఆమె మరణించింది. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన మారియా పెనెలోజా కాబ్‌రెరా అనే 46 ఆరేళ్ల మహిళ కొన్నేళ్ల క్రితం బట్ లిఫ్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకుంది. ఏమైందో ఏమో తెలీదు కానీ, ఆమె వాటిని తీసేయించుకోవాలని భావించింది. ఇందుకోసం ఓ డాక్టర్‌ను సంప్రదించింది. అతడు సర్జరీ చేయడానికి ఒప్పుకున్నాడు.
ఆ ఆపరేషన్ ఇంట్లో చేయాలని మారియా కోరింది. ఇందుకు కూడా ఆ డాక్టర్ ఒప్పుకున్నాడు. మార్చి 28వ తేదీన మారియా ఇంట్లోనే ఆపరేషన్ జరిగింది. సరైన మెడికల్ సెట్ లేకుండానే ఆ డాక్టర్ ఆపరేషన్ చేసి బట్ ఇంప్లాంట్స్‌ను బయటకు తీశాడు. ఆపరేషన్ జరిగిన కొన్ని గంటల పాటు ఆమె బాగానే ఉండింది. తర్వాతి నుంచి ఏదో తేడా కొట్టింది. ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అయినా ఆమె పట్టించుకోలేదు. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అప్పటికే పరిస్థితి చేయి దాటి పోయింది. ఏప్రిల్ 11వ తేదీన మారియా కన్నుమూసింది.
ఆపరేషన్ చేయించుకున్న 13 రోజులకే ఆమె చనిపోవటం గమనార్హం. లిడోకైన్ టాక్సిసిటీ కారణంగా ఆమె చనిపోయినట్లు సమాచారం. ఇక, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మారియాకు ఆపరేషన్ చేసిన డాక్టర్‌ను హోయోస్ ఫొరొండగా గుర్తించారు. మారియా చనిపోయిందన్న విషయం తెలియగానే అతడు సిటీ వదిలి పారిపోవాలని భావించాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. జాన్ ఎఫ్ కెనడీ ఎయిర్‌పోర్టులో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని ఫేక్ డాక్టర్‌గా గుర్తించారు. హోయోస్ కారణంగా మారియా ఇద్దరు పిల్లలు తల్లి లేని వాళ్లు అయిపోయారు.
ఇవి కూడా చదవండి
JEE topper: పరీక్షకు ముందు యాక్సిడెంట్.. అయినా జేఈఈ టాపర్‌గా..
CID 2 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు.. ఆయన బతికే ఉన్నాడు