Iran: ఇరాన్ పోర్టులో భారీ పేలుడు
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:57 AM
ఇరాన్ దేశం బందర్ అబ్బాస్ నగరంలోని షహీద్ రజేయి పోర్టులో ఘోర ప్రమాదం సంభవించింది. శక్తిమంతమైన పేలుడు ధాటికి పోర్టు ధ్వంసం అయ్యింది. ఈ ప్రమాదంలో మంటలు పెద్దఎత్తున ఎగిసిపడి ఆస్తి, ప్రాణనష్టం మిగిల్చాయి.

ఐదుగురి మృతి, ఏడు వందల మందికి గాయాలు
టెహ్రాన్, ఏప్రిల్ 26: ఇరాన్ బందర్ అబ్బాస్ నగరంలోని షహీద్ రజేయి పోర్టులో జరిగిన శక్తిమంతమైన పేలుడు, అగ్ని ప్రమాద ఘటనలో ఐదుగురు చనిపోయారు. ఏడు వందల మంది గాయపడ్డారు. మంటలు పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. నల్లటి మబ్బులు కమ్మేశాయి. పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోంది. అణు కార్యక్రమంపై ఇరాన్- అమెరికా మధ్య ఒమన్‌లో మూడో విడత పరోక్ష చర్చలు జరుగుతున్న సమయంలో రజేయి పోర్టులో పేలుడు జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్