Pravind Jagnauth: మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్ట్!
ABN , Publish Date - Feb 16 , 2025 | 10:02 PM
మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్‌ను స్థానిక పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

నగదు అక్రమ రవాణా కేసులో మారిషస్ మాజీ ప్రధాని ప్రవింద జగన్నాథ్‌ను స్థానిక పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతర అనుమానితుల ఇళ్లల్లో రెయిడ్లు జరిపి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు (Mauritius).
మనీ లాండరింగ్ కేసులో మాజీ ప్రధానితో పాటు ఆయన భార్య కోబితను ప్రశ్నించేందుకు శనివారమే వారిని అదుపులోకి తీసుకున్నారు. కొన్ని గంటల పాటు వారిని విచారించిన అనంతరం అరెస్టు చేసినట్టు ప్రకటించారు. ఆ తరువాత కోబితను విడుదల చేసినప్పటికీ ప్రవింద్ జగన్నాథ్‌ను మాత్రం తమ ఆధీనంలోనే ఉంచారు. ‘‘తనపై వచ్చిన ఆరోపణలను మాజీ ప్రధాని ఖండించినట్టు ఆయన తరపు లాయర్ పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తన వాదనను పోలీసులకు వెల్లడించినట్టు తెలిపారు. త్వరలో ఆయనను న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు.
Mauritius: విదేశీ గడ్డపై తొలి జనఔషధి కేంద్రం.. జై శంకర్ చేతుల మీదుగా ప్రారంభం
ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తి ఇంట్లో తనిఖీలు నిర్వహించామని, ఈ సందర్భంగా మాజీ ప్రధాని, ఆయన భార్య పేర్లు ఉన్న కొన్ని దస్త్రాలను సీజ్ చేశామని తెలిపారు. పలు లగ్జరీ చేతి గడియారాలు, వివిధ దేశాల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
2017-24 మధ్య కాలంలో ప్రవింద్ మారిషస్‌కు ప్రధానిగా సేవ చేసిన విషయం తెలిసిందే. మారిషస్ రాజకీయాల్లోని ప్రముఖ కుటుంబాల్లో ప్రవింద్ కుటుంబం కూడా ఒకటి. బ్రిటన్ నుంచి 1968లో స్వాతంత్ర్యం పొందిన అనంతరం మారిషస్ మంచి అభివృద్ధి సాధించింది.
Port Louis: మారిషస్ సంచలన నిర్ణయం.. అయోధ్య కోసం ఏకంగా...
ఇక ప్రవింద్ హయాంలో బ్రిటన్ ఛాగోస్ ఐల్యాండ్‌ను మారిషస్‌కు అప్పగించింది. అయితే, నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. ఈ ఎన్నికల్లో నవీన్ రామ్‌గులామ్ విజయం సాధించి ప్రధాని బాధ్యతలు చేపట్టారు.
కాగా, ఛాగోస్‌కు సంబంధించి మరింత పరిహారం కోరుతూ మారిషస్ మరోసారి బ్రిటన్‌తో చర్చలు ప్రారంభించింది. అయితే, ఈ అంశంపై తుది నిర్ణయం అమెరికా ప్రభుత్వానిదేనని బ్రిటన్, మారిషస్ పేర్కొన్నాయి. ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో ముఖ్యమైన మిలిటరీ స్థావరంగా ఉన్న ఈ ద్వీప సముదాయాన్ని బ్రిటన్ అమెరికాకు అద్దెకు ఇచ్చింది.
For Latest News and National News click here