Share News

Elon Musk: శ్వేతసౌధంలో ట్రెజరీ సెక్రెటరీతో మస్క్ బాహాబాహీ.. విషయం తెలిసి ట్రంప్ షాక్

ABN , Publish Date - Jun 08 , 2025 | 04:03 PM

యూఎస్ ట్రెజరీ సెక్రెటరీతో మస్క్ బాహాబాహీకి దిగినట్టు తాజాగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. శ్వేతసౌధంలోనే ఇరువురి మధ్య ఈ ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది.

Elon Musk: శ్వేతసౌధంలో ట్రెజరీ సెక్రెటరీతో మస్క్ బాహాబాహీ.. విషయం తెలిసి ట్రంప్ షాక్
Elon Musk White House fight

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్‌ల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. యూఎస్ ట్రెజరీ సెక్రెటరీతో ఎలాన్ మస్క్ శ్వేతసౌధంలోనే బాహాబాహీకి దిగినట్టు ట్రంప్ సన్నిహిత మిత్రుడు, శ్వేత సౌధం మాజీ వ్యూహకర్త స్టీవ్ బ్యానన్ పేర్కొన్నట్టు అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనం ప్రచురితమైంది.

ఏప్రిల్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసులో తాము సూచించిన వ్యక్తిని నియమించాలని ట్రంప్‌ను అభ్యర్థించేందుకు ఆ రోజు మస్క్, ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెసెంట్.. ఓవల్ ఆఫీసు(అధ్యక్షుడి కార్యాలయం)కు వెళ్లారు. ఆ తరువాత కొంతసేపటికి ఇరువురూ బయటకు వచ్చారు. వైట్‌హౌస్ కారిడార్‌లో వెళుతున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. ప్రభుత్వానికి 1 ట్రిలియన్ డాలర్ల డబ్బులు ఆదా చేస్తానన్న విషయం ఏమైందని మస్క్‌ను బెసెంట్ ప్రశ్నించారు. నువ్వో ఫ్రాడ్ అంటూ తీవ్ర విమర్శలకు దిగారట. దీంతో బెసెంట్‌పై మస్క్ భౌతిక దాడికి దిగారట. రగ్బీ ప్లేయర్‌లా తన భుజంతో బెసెంట్‌ను తోయగా బెసెంట్‌ కూడా మస్క్‌కు అదే స్థాయిలో బదులిచ్చే ప్రయత్నం చేశారట.


ఇద్దరూ ఇలా తలపడటం చూసిన ఇతరులు వెంటనే వారిని విడదీసే ప్రయత్నం చేశారు. ఆ తరువాత మస్క్‌ను వారు వెస్ట్ వింగ్ భాగం నుంచి బయటకు తీసుకెళ్లారు. ట్రంప్‌నకు ఈ విషయం తెలిసి.. ‘ఇది చాలా టూ మచ్’ అని అన్నట్టు స్టీవ్ బ్యానన్ మీడియాకు తెలిపారు. ఈ ఘర్షణ సమయంలోనే మస్క్ కంటి కింద స్వల్ప గాయమైందని సమాచారం. డోజ్ శాఖలో చివరి రోజున ట్రంప్‌తో కలిసి పత్రికా సమావేశంలో మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మస్క్ కంటి కింద కనిపించిన గాయం నాటి గొడవలో తగిలిందేనని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.


ఇక ట్రంప్‌పై మస్క్ సంచలన ఆరోపణలు పర్వం కొనసాగుతూనే ఉంది. సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్‌స్టైన్‌ కేసుకు సంబంధించిన ఫైల్స్‌లో ట్రంప్ పేరు కూడా ఉందంటూ మస్క్ ఓ సంచలన పోస్టు పెట్టి ఆ తరువాత కొద్దిసేపటికి తొలగించారు. మరోవైపు, మస్క్‌కు మతి తప్పిందంటూ ట్రంప్ మండిపడ్డారు. మాదకద్రవ్యాల అలవాటు కారణంగానే అతడికి ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు.

ఇవీ చదవండి:

మస్క్ తప్పు చేస్తున్నారు.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

మస్క్ ఒక ఏలియన్, అమెరికా నుంచి పంపించేయాలి: ట్రంప్ సన్నిహితుడి డిమాండ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 08 , 2025 | 04:33 PM