Share News

Elon Musk: రోబోలు ఐదేళ్లలో సర్జన్లను మించిపోతాయి!

ABN , Publish Date - Apr 29 , 2025 | 04:50 AM

రోబోలు వచ్చే ఐదేళ్లలోనే సర్జన్లను మించి శస్త్రచికిత్సల్లో నైపుణ్యాన్ని చూపుతాయని ఎలాన్ మస్క్ చెప్పారు. ఇప్పటికే 137 సర్జరీల్లో రోబోలు విజయవంతంగా పనిచేసినట్లు ఓ నివేదిక వెల్లడించింది.

Elon Musk: రోబోలు ఐదేళ్లలో సర్జన్లను మించిపోతాయి!

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 28: శస్త్రచికిత్సల విషయంలో రోబోలు భవిష్యత్తులో వైద్యులను (సర్జన్లను) మించిపోతాయని ఎలాన్‌ మస్క్‌ పేర్కొన్నారు. ‘రానున్న కొన్నేళ్లలోనే మంచి సర్జన్లను రోబోలు మించిపోతాయి. ఐదేళ్లలోపే అత్యుత్తమ సర్జన్లనూ మించిన నైపుణ్యం చూపుతాయి. వేగం, కచ్చితత్వంలో రోబోలతో పోటీ పడటం మనుష్యులకు సాధ్యం కాదు’ అని ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ఎక్స్‌లో టాక్‌ షో నిర్వహించే మారియో నఫాల్‌ అనే వ్యక్తికి ఓ అంశంపై ప్రత్యుత్తరం ఇస్తూ మస్క్‌ ఈ వ్యాఖ్య చేశారు. కాగా, ఇప్పటికే శస్త్రచికిత్సల్లో రోబోల పనితీరును వెల్లడించే ఓ నివేదికను మారియో షేర్‌ చేశారు. ఈ నివేదిక ప్రకారం.. 137 సర్జరీల్లో రోబోలను ఉపయోగించగా, రెండు కేసులు తప్ప మిగిలిన అన్నింటినీ అవి విజయవంతంగా పూర్తి చేశాయి. ఆ రెండు కూడా.. ఒక కేసులో సంబంధిత రోబోలో సాంకేతిక సమస్యలు రాగా, మరో కేసులో పేషంట్‌ పరిస్థితి సంక్లిష్టంగా ఉండటంతో సర్జన్లతోనే ఆపరేషన్‌ జరిపారు.


ఇవి కూడా చదవండి..

PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..

Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం

For National News And Telugu News

Updated Date - Apr 29 , 2025 | 04:50 AM