Donald Trump: జిన్‌పింగ్ ఫోన్ చేశారు
ABN , Publish Date - Apr 29 , 2025 | 04:54 AM
డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఇటీవల ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి సంభాషణ జరగలేదని చైనా అధికార ప్రతినిధి ఖండించారు.

అలాంటిదేం లేదంటూ తోసిపుచ్చిన చైనా
హాంగ్‌కాంగ్: చైనా సహా అనేక దేశాలపై ఇటీవల ప్రతీకార సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఆ దేశాధ్యక్షుడిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవల తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రకటించారు. అయితే చైనా ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చింది. ఇటీవలి కాలంలో ఇరు దేశాల అధ్యక్షుల మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణలు జరగలేదని తేల్చిచెప్పింది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన స్నేహితుడని పలుమార్లు ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్.. గతవారం టైమ్ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన గురించి ప్రస్తావించారు. ‘‘ఆయన నాకు ఫోన్ చేశారు, దానిని ఆయన బలహీనతగా నేను భావించడం లేదు. నేను ఆ విషయం గురించి స్పందించాలని అనుకోవడం లేదు కూడా.. కానీ ఆయనతో చాలా సార్లు మాట్లాడాను’’ అని తెలిపారు. కానీ చైనా అధ్యక్షుడితో ఎప్పుడు మాట్లాడారు, ఏ అంశంపై మాట్లాడారనే వివరాలను ట్రంప్ వెల్లడించలేదు. ఈ విషయంపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి గుయో జియాకున్ స్పందించారు. తనకు తెలిసినంత వరకు ఇటీవలి కాలంలో ఇరుదేశాల అఽధ్యక్షుల మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణలు జరగలేదని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
PM Modi: ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 40 నిమిషాల భేటీ..ఏం చర్చించారంటే..
Pahalgam Terror Attack: అసెంబ్లీ ప్రత్యేక సమావేశం.. ఉగ్ర దాడిపై స్పందించిన సీఎం
For National News And Telugu News