UGVs At Tibet Border: చైనా మరో స్కెచ్.. సరిహద్దుల వద్ద మాన్‌స్టర్స్..
ABN , Publish Date - Jul 04 , 2025 | 10:12 AM
UGVs At Tibet Border: చైనా అన్ మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ (UGV)లను పెద్ద సంఖ్యలో తయారు చేస్తోంది. వీటిని ఎక్కడినుంచైనా ఆపరేట్ చేయొచ్చు. వీటి కోసం జవాన్లు యుద్ధ భూమిలోకి దిగాల్సిన అవసరం లేదు.

ప్రపంచం మొత్తం ఒక తీరు.. మాదొక తీరు అనే చైనా.. టెక్నాలజీ పరంగా మాత్రం టాప్‌లో ఉంది. కొత్త కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తూ.. దేవుడి సృష్టికి ప్రతి సృష్టి చేస్తోంది. టెక్నాలజీని ఉపయోగించి ఆర్మీని మరింత పటిష్టం చేస్తోంది. చైనా ఏ దేశంపైనా నేరుగా యుద్ధానికి దిగకపోయినా.. యుద్ధానికి మాత్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. పరోక్ష యుద్ధానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తమ సైనికులను యుద్ధానికి పంపకుండా.. మిషిన్లతోటే యుద్ధం చేయడానికి చూస్తోంది.
ఇందుకోసం అన్ మ్యాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ (UGV)లను పెద్ద సంఖ్యలో తయారు చేస్తోంది. వీటిని ఎక్కడినుంచైనా ఆపరేట్ చేయొచ్చు. వీటి కోసం జవాన్లు యుద్ధ భూమిలోకి దిగాల్సిన అవసరం లేదు. చైనా ప్రస్తుతం యూజీవీలపై పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. హిమాలయాల్లో పట్టు సాధించటం కోసం వీటిని ఉపయోగించాలని చూస్తోంది. మనుషులు వెళ్లలేని చోటుకు కూడా యూజీవీలు వెళ్లగలవు. జవాన్ల కంటే వేగంగా కదలగలవు. చైనా ఇప్పటికే చాలా యూజీవీలను తయారు చేసింది.
యూజీవీలలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి షార్ప్ క్లా.. రెండోది షార్ప్ క్లా 2. షార్ప్ క్లా 120 కేజీల బరువు ఉంటుంది. ఆరు కిలోమీటర్ల రేంజ్ వరకు వీటిని ఆపరేట్ చేయవచ్చు. కొండలపైకి కూడా ఎక్కగలవు. వీటిలో మిషిన్ గన్స్ ఉంటాయి. కెమెరాల ద్వారా అన్నిటిని చూడగలదు. షార్ప్ క్లా 2 గుహల్ని, బంకర్లను, బిల్డింగులను ధ్వంసం చేయగలదు. చైనా నాలుగు కాళ్ల రోబో కక్కులు, తోడేళ్లను కూడా తయారు చేసింది. అయితే, వాటిని మాత్రం యుద్ధ భూమిలోకి తీసుకురాలేదు.
చైనా తమ యూజీవీలను టిబెట్ సరిహద్దుల దగ్గరకు చేర్చినట్లు తెలుస్తోంది. ఈ విషయమే భారత్‌ను భయపెడుతోంది. హిమాలయాల్లో భారత జవాన్లు.. చైనా యూజీవీలతో పోరాటం చేస్తే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఇదే భారత్‌ను కలవరపెడుతోంది. చైనా గోతి కాడ నక్కలాగ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది.
ఇవి కూడా చదవండి
హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్.. దీపిక కంటే ముందు ఆ భారతీయ నటుడు
వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. ఈ ఫోన్లలో ఇకపై పని చేయదు..