26 IPhones Glued To Body: 26 ఐఫోన్స్ శరీరానికి అతికించుకున్న యువతి.. ఊహించని విషాదం..
ABN , Publish Date - Aug 03 , 2025 | 05:41 PM
26 IPhones Glued To Body: పరానా, గౌరాపావాలో ఉన్న ఓ రెస్టారెంట్ దగ్గర ఆ బస్ ఆగింది. బస్ ఆగిన కొద్దిసేపటికి ఆమె అస్వస్థతకు గురైంది. ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందిగా ఉందని తోటి ప్రయాణికులకు చెప్పింది. వారు వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశారు.

26 ఐఫోన్స్ శరీరానికి అతికించుకుని బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతి జీవితం అనుకోని విధంగా విషాదంగా ముగిసింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆ యువతి చనిపోయింది. ఈ సంఘటన బ్రెజిల్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. సావో పాలోకు చెందిన 20 ఏళ్ల ఓ యువతి జులై 29వ తేదీన పాజ్ డో ఇగాకు నుంచి సావో పాలో వెళుతున్న బస్ ఎక్కింది. పరానా, గౌరాపావాలో ఉన్న ఓ రెస్టారెంట్ దగ్గర ఆ బస్ ఆగింది. బస్ ఆగిన కొద్దిసేపటికి ఆమె అస్వస్థతకు గురైంది.
ఊపిరి తీసుకోవటంలో ఇబ్బందిగా ఉందని తోటి ప్రయాణికులకు చెప్పింది. వారు వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్‌కు ఫోన్ చేశారు. ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది అక్కడికి వచ్చారు. చికిత్స మొదలెట్టారు. అయితే, లాభం లేకపోయింది. యువతి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దాదాపు 45 నిమిషాలు వారు ఆమెను కాపాడ్డానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. యువతి అక్కడే చనిపోయింది. చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె శరీరానికి 26 ఐఫోన్లు అతికించి ఉండటం ఎమర్జెన్సీ సిబ్బంది గుర్తించారు. వాటిని పక్కన తీసి పెట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి బాడీని పోస్టుమార్టం నిమిత్తం పంపారు. పోలీసులు ఆమె బ్యాగును చెక్ చేయగా.. మద్యం బాటిల్ బయటపడింది. ఐఫోన్స్‌ను సీజ్ చేసి బ్రెజిల్ ఫెడరల్ రెవెన్యూ సర్వీస్‌కు తరలించారు. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆ యువతి ఐఫోన్స్‌ను స్మగ్లింగ్ చేస్తూ ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే యువతి మరణానికి గల కారణాలు తెలుస్తాయని అన్నారు.
ఇవి కూడా చదవండి
బాలిక ఫొటోలు స్టేటస్ పెట్టిన యువకుడు.. చావగొట్టిన అన్న..
మానవత్వం అంటే ఇది.. 200 కేజీల ఆవును భుజాలపై మోసుకెళ్లి..