Balloon Crash: గాల్లో ఉండగా హాట్ ఎయిర్ బెలూన్‌లో మంటలు.. కిందపడి 8 మంది దుర్మరణం
ABN , Publish Date - Jun 22 , 2025 | 07:45 AM
బ్రెజిల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గాల్లో మంటలు అంటుకున్న బెలూన్ వేగంగా కింద పడటంతో లోపలున్న 8 మంది దుర్మరణం చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి.

బ్రెజిల్‌లో తాజాగా ఘోర ప్రమాదం సంభవించింది. హాట్ ఎయిర్ బెలూన్ గాల్లో ఉండగా మంటలు రేగి కింద పడటంతో లోపలున్న 8 మంది దుర్మరణం చెందారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. శాంటా కాటరీనాలో శనివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
బెలూన్‌కు నిప్పు అంటుకుని నేలపైకి వేగంగా దూసుకొచ్చిన ఘటన తాలూకు దృశ్యాలు నెట్టింట కలకలం రేపుతున్నాయి. ప్రాణాలను కాపాడుకునేందుకు ఓ వ్యక్తి బెలూన్ నుంచి బయటకు దూకేయడం కూడా వీడియోలో రికార్డయ్యింది. ఉదయం సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఘటన జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయని శాంటా కాటరీనా గవర్నర్ పేర్కొన్నారు. ‘ఈ ప్రమాదం మమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బాధిత కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటాము. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాము’ అని తెలిపారు.
ఇవీ చదవండి:
ట్రంప్ వీసా ఆంక్షలతో వైద్య సిబ్బంది కొరత.. అందోళనలో అమెరికా ఆసుపత్రులు
కెనడాలో భారతీయ యువతి మృతి.. వెల్లడించిన కాన్సులేట్ కార్యాలయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి