Blast At Supermarket: షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 50 మంది మృతి..
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:31 PM
Blast At Supermarket: సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజెన్లతో మార్కెట్ దగ్గరకు చేరుకున్నారు. ఎంతో కష్టపడి మంటల్ని అదుపులోకి తెచ్చారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.

ఇరాక్‌లో భారీ విషాదం చోటుచేసుకుంది. షాపింగ్ మాల్‌లో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో ఏకంగా 50 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానిక అధికారులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. తూర్పు ఇరాక్‌లోని అల్‌కట్ సిటీలో ఓ హైపర్ మార్గెట్ ఉంది. బుధవారం రాత్రి హైపర్ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిమిషాల్లోనే మార్కెట్ మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది.
హైపర్ మార్కెట్‌లో షాపింగ్‌కు వచ్చిన 50 మంది ఆ మంటల్లో కాలిబూడిదయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఫైర్ ఇంజెన్లతో మార్కెట్ దగ్గరకు చేరుకున్నారు. ఎంతో కష్టపడి మంటల్ని అదుపులోకి తెచ్చారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక, పోలీసులు ఈ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ విషాదంపై గవర్నర్ మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదని అన్నారు. ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించిన వివరాలను 48 గంటల్లో వెల్లడిస్తామన్నారు.
బిల్డింగ్ యజమాని, మాల్ యాజమాన్యంపై లా సూట్ వేశామని ఆయన అన్నారు. ఇక, సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో బిల్డింగ్ తగలబడిపోతున్న భీకర దృశ్యాలు ఉన్నాయి. బిల్డింగ్ మొత్తం మంటల్లో తగలబడిపోతూ ఉంది. ఆ ప్రాంతం మొత్తం ఎర్రటి రంగులోకి మారిపోయింది. పెద్ద సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకుని మంటల్ని ఆపుతూ ఉన్నాయి. జనం పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ ముందు చేరి చూస్తూ ఉన్నారు.
ఇవి కూడా చదవండి
వర్ష భీభత్సం.. మహిళ మృతి.. అమర్‌నాథ్ యాత్ర రద్దు..
ప్రజలకు ముఖ్యమంత్రి బంపర్ ఆఫర్.. ఆగస్టు నుంచి ఉచిత కరెంట్