Share News

AI will cause mass unemployment: AI వల్ల జీవనోపాధి ఎలా అనే పరిస్థితి వస్తుంది

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:38 PM

AI వల్ల సమీప భవిష్యత్ లో ఎంతటి విపరీత పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయో చెప్పారు టెక్ దిగ్గజం బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. ప్రజలు తమ జీవనోపాధి గురించి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి..

AI will cause mass unemployment: AI వల్ల జీవనోపాధి ఎలా అనే పరిస్థితి వస్తుంది
AI will cause mass unemployment

AI Effect: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో సమీప భవిష్యత్ లో లక్షలాది ఉద్యోగాలు గల్లంతే అంటున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేడ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. వేర్వేరు వేదికలపై వీరిద్దరూ ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. ఇది రాబోయే రోజుల్లో ఎంతటి ప్రభావాన్ని చూపుతుందంటే, ఉద్యోగాలు లేక బ్రతకడమెలా..? కుటుంబాన్ని పోషించేదెలా.? అనే స్థాయిలో మార్పులు ఉంటాయని ఇరువురు అభిప్రాయపడ్డారు. గత వందేళ్లలో ఏనాడు చూడనంత అభివృద్ధిని ఏఐ ద్వారా చూస్తారని చెప్పారు. "సాంకేతికత పెరిగే కొద్దీ.. ఏఐ మరింత ప్రభావవంతంగా, వేగంగా అందుబాటులోకి వస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆటోమేషన్‌కు అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌. అయితే, కేవలం తయారీ రంగాన్ని మాత్రమే ఆటోమేటిక్‌ చేయట్లేదు. ఉన్నత స్థాయి మేధోపరంగానూ అనేక పనులు చేస్తోంది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ డెవలపర్లు చేసే 70శాతం పనులను ఏఐ చేయగలదు. నిపుణులైన ఉద్యోగులు, మంచి జీతభత్యాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఏఐ రాక కాస్త గందరగోళానికి గురిచేస్తుంది. కృత్రిమ మేధ వినియోగం పెరిగితే చాలా ఉద్యోగాలు గల్లంతే. వందేళ్లలో ఎన్నడూ చూడనంత అభివృద్ధిని జనం చూస్తారు. దీనివల్ల బ్లూ కాలర్‌ ఉద్యోగులే కాదు, చాలా మంది వైట్ కాలర్ ఉద్యోగులూ ఆందోళనలో పడుతారు. ఉద్యోగం ఎలా? కుటుంబాన్ని పోషించేందుకు ఆదాయం ఎలా? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి’’ అని ఒబామా అభిప్రాయపడ్డారు. త్వరలో ఎదురయ్యే ఒక ప్రత్యేక సందర్భంలో, AI-ఆధారిత ఆటోమేషన్ అన్ని రంగాలలోని ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందని ఒబామా అన్నారు. ఈ మార్పు ఏ స్థాయిలో ఉంటుందంటే, ప్రజలు తమ జీవనోపాధి గురించి పునరాలోచించుకోవాల్సిన పరిస్థితిని తీసుకువస్తుందని చెప్పారు.

ఇక, బిల్ గేట్స్ ఏమంటున్నారంటే, "ఇది ఏఐ యుగం.. మనకిప్పటివరకూ ఉన్న జ్ఞానంపై సమాజం దృక్కోణాన్ని సమూలంగా మార్చే శకం. ఇప్పటివరకు గొప్ప గొప్ప డాక్టర్లు, టీచర్ల మేధ అద్భుతం అని కొనియాడాం. కానీ, ఏఐ రాకతో రాబోయే దశాబ్ద కాలంలో వీరికి ఉండే జ్ఞానం ఉచితంగా, అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మన జనాభాకు సరిపడా వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత ఉంది. దీంతో ఏఐతో లభించే మెడికల్‌ సలహాలు, టీచింగ్‌ క్లాస్‌లు అందరికీ నచ్చుతాయి. అయితే, దీని పర్యావసానాలను కొట్టిపారేయలేం. ఇదంతా పక్కనబెడితే.. మరి ఉద్యోగాల సంగతేంటీ? కనీసం వారానికి రెండు, మూడు రోజులైనా పని చేయగలమా? అనేది తెలియదు" అని బిల్‌గేట్స్‌ అంటున్నారు. చాలా విషయాల్లో మాత్రం ఏఐ సమస్యలను పరిష్కరిస్తోందని టెక్‌ దిగ్గజం తెలిపారు. కృత్రిమ మేధతో కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయని, పనులు వేగవంతమవుతున్నాయని బిల్ గేట్స్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

Monthly Income: 50 ఏళ్ల తర్వాత నెలకు రూ.లక్ష కావాలంటే ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు చేయాలి
Interest Rates: ఇన్వెస్ట్ చేస్తున్నారా, లోన్ తీసుకుంటున్నారా.. SBI, HDFC, BOI కొత్త వడ్డీ రేట్లు చూశారా..

Forex vs Credit Card: జీరో ఫారెక్స్ కార్డ్ vs క్రెడిట్ కార్డ్..వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 03:39 PM