Human Job Impact: మసాజ్ చేసే ఏఐ రోబో
ABN , Publish Date - Aug 03 , 2025 | 06:10 AM
ఏఐ విస్తృత అభివృద్ధితో మానవ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అమెరికా కంపెనీ మానవ మసాజ్‌కు ప్రత్యామ్నాయంగా...

న్యూయార్క్, ఆగస్టు 2: ఏఐ విస్తృత అభివృద్ధితో మానవ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ అమెరికా కంపెనీ మానవ మసాజ్‌కు ప్రత్యామ్నాయంగా మొట్టమొదటి ఏఐ ఆధారిత మసాజ్ రోబోను పరిచయం చేసింది. ఈ నూతన టెక్నాలజీ తమ ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడుతుందోనని థెరపిస్టులు భయపడుతున్నారు. అమెరికాలోని ఎస్కేప్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఈ ఏఐ మసాజ్ రోబో.. మనిషి శరీరాకృతి, కండరాల పనితీరు ఆధారంగా తగిన రీతిలో మర్దన చేస్తుంది. ఈ మసాజ్‌లో వినియోగదారుడికి ప్రత్యేక సూట్‌ను ధరింపజేస్తారు. ఇది మనిషి శరీరాన్ని 10 లక్షల 3డీ డేటా పాయింట్లతో మ్యాప్ చేస్తుంది. అనంతరం రోబోకు అమర్చిన భుజం మంచం మీద పడుకున్న మనిషి శరీరం అంతటా సంచరిస్తూ, శరీరానికి అవసరమైన ఒత్తిడిని కలిగిస్తూ మర్దన చేస్తుంది. ఈ ఏఐ రోబో ఏడు రకాల మసాజ్ పద్ధతులను కచ్చితమైన ఒత్తిడితో తగిన ఉష్ణోగ్రతను అందిస్తుందని ఎస్కేప్ సంస్థ వ్యవస్థాపకుడు ఎరిక్ లిట్‌మన్ తెలిపారు.