Afghanistan: అఫ్ఘనిస్థాన్‌లో బహిరంగ శిక్ష.. 13 ఏళ్ల బాలుడి చేత చంపించిన పోలీసులు
ABN , Publish Date - Dec 03 , 2025 | 12:00 PM
అఫ్ఘానిస్తాన్‌లో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒకే ఫ్యామిలీకి చెందిన 13 మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడ్ని పోలీసులు 13 ఏళ్ల బాలుడు చేత కాల్చి చంపించారు. ఈ సందర్భంగా శిక్ష అమలు జరిగిన స్టేడియం భిడ్డు నినాదాలతో..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 3: తాలిబాన్ పాలిత అఫ్ఘానిస్తాన్‌లోని కోస్ట్ ప్రాంతంలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. ఒక హంతకుడికి బహిరంగ శిక్ష అమలు చేయడంలో షాకింగ్ పనిచేశారు ఆఫ్ఘాన్ పోలీసులు. ఒకే ఫ్యామిలీకి చెందిన 13 మందిని దారుణంగా హత్య చేసిన నిందితుడు మంగల్(తలా ఖాన్)ను, 13 ఏళ్ల బాలుడు చేత కాల్చి చంపించారు.
ఈ శిక్షను స్థానిక స్పోర్ట్స్ స్టేడియంలో 80 వేల మంది ప్రజల ముందు అమలు చేశారు. అఫ్ఘాన్ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ 'ఖిసాస్' (ప్రతీకార శిక్ష) జరిగింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం, మంగల్ 10 నెలల క్రితం అలీ షిర్ టెరెజియో జిల్లాల్లో నివశించే అబ్దుల్ రహ్మాన్.. అతని కుటుంబంలోని 12 మందిని (9 మంది పిల్లలు, ముగ్గురు మహిళలు) తుపాకీతో కాల్చి చంపాడు.
ఈ హత్యలకు అతనికి జీవిత ఖైదు శిక్ష పడింది. శిక్ష అమలు సమయంలో తాలిబాన్ అధికారులు బాలుడిని (అబ్దుల్ రహ్మాన్ కుమారుడు, బతికున్న ఏకైక వ్యక్తి) మంగల్‌కు క్షమాభిక్ష పెడతావా అని అడిగారు.. కానీ బాలుడు నిరాకరించడంతో, అతనికి తుపాకీ ఇచ్చి మంగల్‌పై మూడు రౌండ్ల కాల్పులు జరిపించారు. ఈ సందర్భంగా స్టేడియం భిడ్డు 'అల్లాహు అక్బర్' నినాదాలతో దద్ధరిల్లింది.
కోస్ట్ పోలీస్ ప్రతినిధి ముస్తఘఫిర్ గోర్బాజ్ ఈ ఘటనను ధృవీకరించారు. తాలిబాన్ పాలితంలో షరియా చట్టం కింద ఇలాంటి బహిరంగ శిక్షలు పెరుగుతున్నాయి. అయితే, అంతర్జాతీయ సమాజం ఈ శిక్షను 'అమానవీయమైనది, అత్యంత క్రూరమైనది' అని ఖండిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టుబట్టి.. మంజూరు చేయించి...
Read Latest Telangana News and National News