Share News

Turkey Earthquake: కూలిన భారీ భవంతులు, భయకంపితులైన జనం

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:40 PM

టర్కీ దేశపు అతిపెద్ద నగరం ఇస్తాంబుల్ చిగురుటాకులా వణికిపోయింది. భారీ భూకంపంతో భారీ భవంతులు నేలమట్టమయ్యాయి. ఇళ్లు, ఆఫీసుల్లో నుంచి జనం పరుగులు తీస్తూ ఆహాకారాలు చేశారు.

Turkey Earthquake: కూలిన భారీ భవంతులు, భయకంపితులైన జనం
Turkey Earthquake

Turkey Earthquake: టర్కీ దేశంలోని అతిపెద్ద నగరం ఇస్తాంబుల్‌లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప ప్రభావంతో నగరమంతా అల్లకల్లోలం అయింది. ప్రకంపనలు సంభవించడంతో భవనాలను ఖాళీ చేయించారు. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ప్రకారం, భూకంపం 10 కిలోమీటర్ల (6.21 మైళ్ళు) లోతులో సంభవించింది. టర్కీ విపత్తు సంస్థ కొన్ని నిమిషాల్లో వరుస ప్రకంపనలను నమోదు చేసిందని, అవన్నీ మర్మారా సముద్రం తీరం వెంబడి, ఇస్తాంబుల్‌కు దగ్గరగా ఉన్నాయని బిబిసి నివేదించింది. 6.2 తీవ్రతతో వచ్చిన రెండవ భూకంపం అత్యంత శక్తివంతమైనదని పేర్కొంది. అయితే, భూకంప నష్టం, మ‌ృతులు, గాయపడ్డ వారి గురించి సమాచారం అందాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి

PSR Remand Report: పీఎస్‌ఆర్ రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే వాస్తవాలు

Pahalgam Attack: బైసారన్ నరమేధంపై విస్తుపోయే వాస్తవాలు చెప్పిన మహిళ

Read Latest Telangana News And Telugu News


Updated Date - Apr 23 , 2025 | 05:52 PM