Share News

Acrometastasis Case: చేతి,కాలి వేళ్లు వాచాయి.. సరిగ్గా రెండు నెలల్లోనే..

ABN , Publish Date - Jul 25 , 2025 | 09:43 PM

Acrometastasis Case: లంగ్ క్యాన్సర్ కేసుల్లో 80 నుంచి 90 శాతం వరకు ఇవే ఉంటాయని అన్నారు. అయితే, ఈ క్యాన్సర్ నుంచి బయటపడ్డం చాలా కష్టమని అంటున్నారు.

Acrometastasis Case: చేతి,కాలి వేళ్లు వాచాయి.. సరిగ్గా రెండు నెలల్లోనే..
Acrometastasis Case

మన శరీరంలోని ప్రతీ అవయవం ఒకదానితో ఒకటి ఇంటర్ లింక్ అయి ఉంటాయి. ఓ అవయవం పాడైందంటే.. ఇందుకు సంబంధించిన సూచనలు శరీరంలో ఏదో ఒక చోట ఇన్ఫెక్షన్ల రూపంలో బయటపడతాయి. మనం వాటిని వీలైనంత త్వరగా గుర్తించి వైద్యం చేయించుకోవాలి. అశ్రద్ధ, ఆలస్యం చేస్తే ప్రాణాలే పోయే అకాశం ఉంది. తాజాగా, ఆస్ట్రేలియాకు చెందిన 55 ఏళ్ల ఓ వ్యక్తి చేతి, కాలి వేళ్లు బాగా వాచాయి. ఆ వాపు ఎంతకీ తగ్గకపోవటంతో అతడు ఆస్పత్రికి వెళ్లాడు.


అక్కడ ఓ షాకింగ్ విషయం బయటపడింది. అతడికి అరుదైన ‘స్క్వామస్ సెల్ లంగ్ క్యాన్సర్’ ఉన్నట్లు తేలింది. క్యాన్సర్ విషయం బయటపడ్డ కొన్ని రోజులకే అతడు చనిపోయాడు. ఈ క్యాన్సర్ మనుషులకు చాలా ఎక్కువగా వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆ క్యాన్సర్ శరీరంలోని అన్ని బాగాలకు పాకుతుందని అన్నారు. మృతుడి కాలి, చేతి వేళ్లలోని ఎముకలు మొత్తం క్యాన్సర్ ట్యూమర్లతో పాడయ్యాయని వెల్లడించారు. స్క్వామస్ సెల్ లంగ్ క్యాన్సర్ శరీరంలోని మెదడు, వెన్నెముక, ఎముకలకు కూడా వ్యాప్తి చెందుతుందని అన్నారు.


ఆఖరికి ఎండ్రినల్ గ్లాండ్, లివర్‌కు కూడా వ్యాపిస్తుందన్నారు. లంగ్ క్యాన్సర్ కేసుల్లో 80 నుంచి 90 శాతం వరకు ఇవే ఉంటాయని అన్నారు. అయితే, ఈ క్యాన్సర్ నుంచి బయటపడ్డం చాలా కష్టమని అంటున్నారు. ఈ క్యాన్సర్ ఎక్కువ మందిలో కనిపించినా.. అది లేట్ స్టేజిలో మాత్రమే బయటపడుతుందని అన్నారు. అందుకారణంగానే ఆ క్యాన్సర్ నుంచి బయటపడ్డం చాలా కష్టమని అంటున్నారు. బతికున్నంత కాలం తక్కువ నొప్పితో బతికేలా చేయటం మాత్రమే సాధ్యపడుతుందని డాక్టర్లు చెప్పారు.


ఇవి కూడా చదవండి

పిట్టలా రోడ్డుపై కుప్పకూలిన మినీ విమానం..

బెంజి కారుపై డ్యాన్స్.. చిక్కుల్లో ముంబై కపుల్

Updated Date - Jul 25 , 2025 | 09:43 PM