Walking - Resistance Training: అతిగా వాకింగ్ చేస్తున్నారా? చిక్కుల్లో పడ్డట్టే..
ABN , Publish Date - Apr 28 , 2025 | 12:58 PM
పూర్తి ఆరోగ్యం కోసం వాకింగ్ ఒక్కటే సరిపోదని చెబుతున్నారు. అతిగా వాకింగ్ చేస్తే అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. మరి వాకింగ్ విషయంలో నిపుణులు చెబుతున్న సూచనలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: వాకింగ్ ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే, పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు కలిగేందుకు వాకింగ్ ఒక్కటే సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయం తెలియిక అతిగా వాకింగ్ చేసే వారు చివరకు చిక్కుల్లో పడతారని కూడా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వయసు మళ్లిన వారు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలట.
2023లో బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం రోజూ 11 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేసే వారికి గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్ల ముప్పు గణనీయంగా తగ్గుతుంది. అయితే, వాకింగ్‌తో పాడు కండరాల బలం, ఫ్లెక్సిబులిటీ పెంచేందుకు ఇతర రకాల కసరత్తులు కూడా చేయాల్సి ఉంటుంది.
వాకింగ్ ఎంత మంచిదైనా దానికి కొన్ని పరిమితులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. యువత, కొత్తగా కసరత్తులు మొదలెట్టేవారికి వాకింగ్‌తో కచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. రక్తప్రసరణ పెరిగి శారీరక, మానసిక ఆరోగ్యాలు ఇనుమడిస్తాయి. వాకింగ్‌తో ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా పెరుగుతుంది. అయితే, వయసు పెరిగే కొద్దీ కండరాల పుష్టి తగ్గుతుంది. ఎముకలు కూడా బోలుగా మారతాయి. వీటిని అడ్డుకునేందుకు స్ట్రెన్త్ ట్రెయినింగ్ ముఖ్యం. కానీ వాకింగ్‌తో ఈ రకమైన ప్రయోజనాలు అంతగా లభించవు. కాబట్టి, ఇతర రకాల కసరత్తులు కూడా తప్పనిసరిగా చేయాలి.
చాలా మందికి ఈ విషయాలపై అవగాహన లేక ఎంతగా నడిస్తే అన్ని ప్రయోజనాలు కలుగుతాయని అనుకుంటూ ఉంటారు. కొందరు సరైన బూట్లు ధరించకుండానే వాకింగ్ చేస్తుంటారు. ఈ తీరు వృద్ధుల్లో మరిన్ని సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. మోకాళ్లు, తుంటెపై అనవసర ఒత్తిడి పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. వెన్నెముక దిగువ భాగంలో నొప్పి మొదలవుతుందని అంటున్నారు.
కాబట్టి, ఇబ్బంది మొదలవుతున్నట్టు అనుమానం రాగానే వాకింగ్ నుంచి విరామాం తీసుకోవాలి. పూర్తిగా కోలుకున్నాకే మళ్లి నడక ప్రారంభించాలి. అవసరమైతే వైద్యులను కూడా సంప్రదించాలి. మంచి షూస్ లేకుండా అస్సలు వాకింగ్ చేయకూడదు.
40 ఏళ్లు దాటిన వారు వాకింగ్‌తో పాటు స్క్వాట్స్, లంజెస్, ప్లాంక్స, బ్యాండ్స్‌తో చేసే ఎక్సర్‌సైజులు చేస్తే శరీరానికి తగినంత రెస్టిస్టెన్స్ ట్రెయినింగ్ లభించి కండరాలు, ఎముకలు బలోపేతం అవుతాయి.
ఇవి కూడా చదవండి:
ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..
మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?