Nutritionist Backed Smoothie: జుట్టు ఎక్కువగా ఊడిపోతుందా? అయితే, ఈ స్మూతీ ట్రై చేయండి..
ABN , Publish Date - Nov 01 , 2025 | 04:26 PM
జట్టు ఊడిపోవటానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. జన్యుపరమైన సమస్యలు పక్కన పెడితే.. మానసిక, శారీరక కారణాల వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. ఒక సమస్య మరో సమస్యకు దారి తీస్తుంది. జట్టు ఊడిపోయేలా చేస్తుంది.
ఈ మధ్యకాలంలో జుట్టు అధికంగా రాలిపోవటం ఓ ప్రధాన సమస్యగా మారిపోయింది. ఆడ, మగ అన్న తేడా లేకుండా అందరూ హెయిర్ ఫాల్ బారినపడుతున్నారు. జుట్టు ఊడిపోవటానికి వాతావరణ సమస్యలు ఓ కారణం అయితే.. ఆరోగ్య సమస్యలు మరో కారణం. జుట్టు ఊడిపోవటానికి 99 శాతం కారణం మన శరీరంలోనే దాగి ఉంటుంది. కుదుళ్లు సరిగా లేకపోవటం, చుండ్రు, జుట్టు పల్చబడటం వంటివి మన శరీరం లోపల సమస్య ఉందని చెప్పే సంకేతాలు.
శాంపూలు, ఆయిల్ మార్చినంత మాత్రాన సమస్య తీరదు. మనకొచ్చే సమస్యలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మానసికంగా తరచుగా ఒత్తిడి గురవుతూ ఉంటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. ఆ జీర్ణ సంబంధ సమస్యల కారణంగా జుట్టు ఊడిపోతుంది. పైపెచ్చు మానసిక ఒత్తిడి నేరుగా కూడా జుట్టుపై ప్రభావం చూపుతుంది. అందుకే ఒత్తిడికి గురవ్వకుండా ఉండాలి. జీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.
ఈ రెండు సమస్యలకు చెక్ పెట్టిన తర్వాత న్యూట్రిషన్‌పై దృష్టి సారించాలి. అధిక పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే స్మూతీని గనుక ప్రతీ రోజూ తీసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. పోషకాల లోపంతో జుట్టు ఊడే సమస్యను పూర్తిగా దూరం చేయవచ్చు.
స్మూతీ తయారు చేసే విధానం..
పది బాదాం గింజలు, పది జీడిపప్పు గింజలు, ఓ టేబుల్ స్పూన్ గుమ్మిడి విత్తనాలు, ఓ టేబుల్ స్పూన్ బ్లాక్ రెజిన్స్, ఓ టేబుల్ స్పూన్ ద్రాక్ష, నాలుగు ఖర్జూర పళ్లు మిక్సీలో వేసి వాటిని గ్రైడ్ చేసుకోవాలి. తగినన్ని నీళ్లు కలుపుకుంటూ తాగడానికి వీలుగా ఉండేలా చేసుకోవాలి. 10 నిమిషాల్లో తయారు అయ్యే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఉదయం పూట ఈ స్మూతీని తాగితే చాలా వరకు అనారోగ్య సమస్యల్ని అరికట్టవచ్చు.
(Note: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
ఇవి కూడా చదవండి
ట్రక్కు నిండా కుప్పలుగా డబ్బు.. ఒక్కసారిగా గాల్లోకి ఎగిరేశాడు..
ఈ పిల్లలు బాల మేధావులు.. ఇంత చిన్న వయసులోనే..