Share News

Magnesium Deficiency: జిమ్‌కు వెళ్లొచ్చాక కండరాల నొప్పులు వదలట్లేదంటే..

ABN , Publish Date - Dec 01 , 2025 | 10:23 PM

జిమ్‌కు వెళ్లొచ్చాక కొందరిలో కండరాల నొప్పులు ఎంతకీ వదలవు. ఇందుకు కారణం మెగ్నీషియం లోపం అయ్యి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పోషకాహారం తీసుకుంటే ఈ లోపం తొలగిపోయి కసరత్తులు చేసినందుకు పూర్తి ఫలితం దక్కుతుందని అంటున్నారు.

Magnesium Deficiency: జిమ్‌కు వెళ్లొచ్చాక కండరాల నొప్పులు వదలట్లేదంటే..
Magnesium for Muscle recovery

ఇంటర్నెట్ డెస్క్: జిమ్‌కు వెళ్లి వచ్చాక కండరాల నొప్పులు సహజం. కొంత సేపు అయ్యాక అవే తగ్గిపోతాయి. కానీ కొందరిలో ఈ నొప్పులు ఎంతకీ వదలవు. రాత్రంతా నిద్రపోయాక కూడా తెల్లారి అలసట, ఒంటి నొప్పులతో లేస్తుంటారు. ఇలా పదే పదే అవుతోందంటే కచ్చితంగా సందేహించాలని అనుభవజ్ఞులు చెబుతున్నారు (Magnesium Deficiency-Muscle Pains).

నిపుణులు చెప్పేదాని ప్రకారం, కసరత్తుల తరువాత కండరాలు కోలుకునేందుకు మెగ్నీషియం కూడా ఎంతో అవసరం. సాధారణంగా జనాలు ప్రొటీన్లు తీసుకోవడం, మంచినీరు తాగడం వంటి విషయాలపైనే దృష్టి పెడుతుంటారు. ఇతర పోషకాల విషయంలో కాస్త నిర్లక్ష్యం వహిస్తారు. ఈ వైఖరే చివరకు అనవసర సమస్యలకు దారి తీస్తుంది. మెగ్నీషియం తగినంత ఉంటే కండరాలు త్వరగా కోలుకుంటాయి. లేకపోతే రోజుల తరబడి నొప్పులతో సతమతం కావాల్సి వస్తుంది.


శరీరంలో శక్తి విడుదలకు కూడా మెగ్నీషియం అవసరమని నిపుణులు చెబుతున్నారు. మెగ్నీషియం ఆరోగ్యకర స్థాయిల్లో ఉంటే స్టామినా పెరుగుతుంది. కండరాలు బలంగా ఉంటాయి. మెగ్నీషియంతో మెలటోనిన్ లెవెల్స్‌ కూడా స్థిరంగా ఉంటాయి. దీంతో, రాత్రిళ్లు కంటినిండా నిద్ర పడుతుంది. మర్నాడు పూర్తి ఉత్సాహంతో నిద్ర లేవగలుగుతారు.

మెగ్నీషియం రక్తపోటు నియంత్రణకు కూడా కీలకమే. షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉండేందుకు, గుండె ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. ఇది మైగ్రేన్ తలనొప్పి నుంచి కూడా ఊరట కలిగిస్తుంది. ఎముకలను మరింత దృఢంగా చేస్తుంది. మెగ్నీషియంతో ఆందోళన నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

ఇక మెగ్నీషియం లోపం లేకుండా ఉండాలంటే డార్క్ చాక్లేట్, ఆవకాడోలు, బాదంపప్పులు, కందిపప్పు, సోయా వంటివి క్రమం తప్పకుండా తినాలి. అప్పుడే కసరత్తులతో పూర్తిస్థాయి ప్రయోజనాలు చేకూరుతాయి.


ఇవీ చదవండి:

కాఫీ విషయంలో డాక్టర్ సూచన.. నెట్టింట రేగుతున్న కలకలం

బీటెక్‌లో 17 బ్యాక్‌లాగ్స్.. అయినా వెనక్కు తగ్గలేదు.. ఐదేళ్లు గడిచేసరికి రూ.1.7 కోట్ల శాలరీ

Read Latest and Health News

Updated Date - Dec 02 , 2025 | 07:13 AM