Share News

Baldness Causes: చుండ్రుతో బట్టతల? క్లారిటీ ఇచ్చిన ప్రముఖ వైద్యుడు

ABN , Publish Date - Nov 10 , 2025 | 09:43 PM

బట్టతల, జుట్టు పలుచబడటం వంటి సమస్యలతో నేటి యువతలో అనేక మంది నరకం అనుభవిస్తున్నారు. ఇందుకు సంబంధించి పలు కీలక విషయాలపై ఎయిమ్స్ డాక్టర్ ఒకరు తాజాగా స్పష్టతనిచ్చారు.

Baldness Causes: చుండ్రుతో బట్టతల? క్లారిటీ ఇచ్చిన ప్రముఖ వైద్యుడు
hair loss myths

ఇంటర్నెట్ డెస్క్: నేటి యువతలో అనేక మంది బట్టతల బారిన పడుతున్నారు. కారణాలు, పరిష్కారాలు తెలీక సతమతం అవుతున్నారు. బట్టతల విషయంలో జనాల్లో పలు అపోహలు కూడా ఉన్నాయి. ఈ విషయాలపై ఎయిమ్స్ వైద్యుడు డాక్టర్ గౌరాంగ్ కృష్ణ తాజాగా కీలక విషయాలు వెల్లడించారు (Hairfall, Baldness, Myths Facts).

డా.గౌరాంగ్ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, చుండ్రు కారణంగా బట్టతల రాదు. కేవలం జుట్టు మాత్రమే పలుచబడుతుంది. అది కూడా తాత్కాలికమే. డాండ్రఫ్‌కు కారణమయ్యే ఫంగస్ చర్మంపై నుంచి తొలగిపోతే ఇన్‌‌ఫ్లమేషన్ తగ్గుతుంది. ఆ తరువాత జుట్టు మళ్లీ సహజసిద్ధంగా పెరుగుతుంది. పురుషుల్లో బట్టతలకు జన్యుపరమైన కారణాలే ప్రధానం. ఇక సోరియాసిస్‌తో కూడా అనేక మంది సతమతం అవుతుంటారు. అయితే, ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. శరీరానికి రక్షణగా నిలవాల్సిన రోగ నిరోధక శక్తి స్వయంగా చర్మ కణాలపై దాడి చేసినప్పుడు సోరియాసిస్ మొదలవుతుంది. కొబ్బరి నూనె పెట్టుకుంటే నెత్తిపై సోరియాసిస్ పొలుసులు కాస్త మెత్తబడి సాంత్వన లభించే అవకాశం ఉంది. కానీ, కొబ్బరి నూనె వల్ల చుండ్రు సమస్య తీవ్రమయ్యే అవకాశం ఎక్కువ. డాండ్రఫ్‌ను కలుగజేసే ఫంగస్‌‌కు ఈ నూనె ఆహారంగా మారుతుందని డా. గౌరాంగ్ తెలిపారు.


బట్టతలకు మూడు ప్రధాన కారణాలని డా. గౌరాంగ్ తెలిపారు. 70 శాతం కేసుల్లో జన్యుపరమైన కారణాలే బట్టతలకు దారి తీస్తాయి. ఇక పోషకాహారం లోపం, ఒత్తిడి, నిద్రలేమి కారణంగా 20 శాతం కేసుల్లో జుట్టు అతిగా ఊడిపోయే ప్రమాదం ఉంది. మరో 10 శాతం కేసుల్లో కాలుష్యం వల్ల జుట్టు అతిగా ఊడిపోతుంటుందని ఆయన పేర్కొన్నారు. జుట్టు ఇలా ఊడిపోతున్నప్పుడు ఆందోళన చెందకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. జుట్టు ఊడిపోవడానికి కారణం తెలుసుకుని ట్రీట్‌మెంట్ ప్రారంభిస్తే చాలా సందర్భాల్లో సమస్య సులువుగానే పరిష్కారం అవుతుంది.


ఇవి కూడా చదవండి

40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన బ్లడ్ టెస్టులు

బీపీ ఏ మేరకు పెరిగితే హార్ట్ ఎటాక్ ముప్పు మొదలవుతుందంటే..

Read Latest and Health News

Updated Date - Nov 10 , 2025 | 09:47 PM