Share News

Exercise Duration Recommendations: రోజూ జిమ్‌కు వెళతారా? మీరు తెలుసుకోవాల్సిన తప్పనిసరి విషయాలు ఏంటంటే..

ABN , Publish Date - Apr 28 , 2025 | 02:22 PM

రోజూ ఎంత సేపు ఎక్సర్‌సైజులు చేయాలనేది చాలా మందికి కలిగే సందేహం. దీన్ని నిర్ధారించేందుకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Exercise Duration Recommendations: రోజూ జిమ్‌కు వెళతారా? మీరు తెలుసుకోవాల్సిన తప్పనిసరి విషయాలు ఏంటంటే..
Exercise Duration Recommendations

ఇంటర్నెట్ డెస్క్: జిమ్‌లో ఏయే కసరత్తులు చేయాలి.. ఎంత సేపు చేయాలి అనే అంశాలు ఆయా వ్యక్తుల శరీర తత్వం, ఎంచుకున్న ఆరోగ్య లక్ష్యాలపై ఆధారపడింది. అయితే, రోజుకు ఎంత సేపు ఎక్సర్‌సైజులు చేస్తే మంచి ప్రయోజనం కలుగుతుందనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సవివరమైన సమాధానమే ఇచ్చింది.

డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల ప్రకారం, ఓమోస్తరు తీవ్రత కలిగిన కసరత్తులను వారానికి 150 నిమిషాల పాటు చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఇది కాదనుకుంటే.. రోజుకు 25 నుంచి 30 నిమిషాల చొప్పున అధిక తీవ్రత కలిగిన హై ఇంటెన్సిటీ కసరత్తులు చేసినా మంచి ఫలితాన్ని పొందొచ్చు.


సాధారణంగా మంచి ఆరోగ్యం కోసం రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు ఓ మోస్తరు తీవ్రత కలిగిన కసరత్తులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకున్నా, కండరాలను బలోపేతం చేసుకోవాలనుకున్నా.. ఈ సమయాన్ని గంటకు పొడిగించుకోవాలి. ఇక బిజీగా ఉన్న రోజుల్లో హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజులను 25 నిమిషాల పాటు చేస్తే మనసుపై స్ట్రెస్ తగ్గడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయి. అయితే, ఏ విధానాన్ని ఎంపిక చేసుకున్నా క్రమం తప్పకుండా కొనసాగించడమే అసలు సూత్రమని ఫిట్‌నెస్ పుణులు చెబుతున్నారు.

రోజూ కార్డియో కసరత్తులతో పాటు స్ట్రెగ్త్ ట్రెయినింగ్‌లో కూడా పాలుపంచుకుంటే బోరు కొట్టకుండా ఉంటుందని, ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ చేకూరతాయని అంటున్నారు. కొత్త కొత్త ఎక్సర్‌సైజులు ప్రయత్నిస్తే కూడా ఉత్సాహంగా ఉంటారని చెబుతున్నారు.


60 నిమిషాల పాటు జిమ్‌లో గడిపేటట్టైతే కార్డియో, స్ట్రెగ్త ట్రెయినింగ్ (కండరాల శక్తిని పరీక్షించే కసరత్తులు) వంటి వివిధ రకాల ఎక్సర్‌సైజులు ప్రయత్నించాలనేది నిపుణులు చెప్పే ప్రధాన సలహా. దీంతో, క్యాలరీలు కరిగి బరువు తగ్గడంతో పాటు కండరాలు, ఎముకలు కూడా బలోపేతం అవుతాయి. అయితే, గుండెజబ్బులు లేదా డయాబెటిస్ లాంటి జీవనశైలి సంబంధిత వ్యాధులు ఉన్న వారు ఆ మేరకు తమ వర్కౌట్ రెజీమ్‌లో మార్పులు చేసుకోవాలి. ఒక రోజు కార్డియో చేస్తే రెండో రోజు స్ట్రెంగ్త్ ట్రెయినింగ్‌కు కేటాయించి, మూడో రోజు రెస్టు తీసుకునే పద్ధతితో మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. శరీరానికి ఎక్సర్‌సైజులు ఎంత అవసరమో కసరత్తులు కూడా అంతే అవసరమన్న విషయం మర్చిపోకూడదు.

ఇవి కూడా చదవండి:

ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్

కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..

మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?

Read Latest and Health News

Updated Date - Apr 28 , 2025 | 02:22 PM