Share News

ఆ ఒక్క విటమిన్ లోపం.. మీ వైవాహిక జీవితం నాశనం..

ABN , Publish Date - Apr 17 , 2025 | 10:26 AM

స్పెయిన్‌కు చెందిన టాక్సికాలజిస్టులు కనుగొన్నారు. అంగంలో కార్పోరా కావెర్నోశా అనే స్పాంజి లాంటి టిష్యూ ఉంటుంది. విటమిన్ డీ లోపం వల్ల ఆ టిష్యూపై ప్రభావం పడుతుంది. తద్వారా మగతనం దెబ్బతింటుంది.

ఆ ఒక్క విటమిన్ లోపం.. మీ వైవాహిక జీవితం నాశనం..
Common Nutrient Deficiency

మనిషి బుర్ర చాలా ప్రమాదకరమైనది. మిగిలిన జీవుల్లా కాకుండా ఎప్పుడూ వింతగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ప్రపంచంలోని నూటికి 90 శాతం మంది తమ కోసం కాకుండా.. ఇతరుల కోసం బతుకుతున్నారు. ఇతరుల దృష్టిలో గొప్పగా కనపడాలనే తాపత్రయంతో తనకు తాను దూరం అవుతున్నాడు. అన్ని రకాలుగా నష్టపోతున్నాడు. తన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నాడు. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో.. డబ్బు మీద పిచ్చితో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. తినాల్సిన తిండికంటే.. ఇతర పనులే ముఖ్యం అయిపోతున్నాయి. తద్వారా మానసికంగా.. శారీరకంగా నష్టపోతున్నాడు.


ముఖ్యంగా వైవాహిక బంధంలో తాను ఇబ్బందిపడటంతో పాటు.. భాగస్వామిని కూడా ఇబ్బందిపెడుతున్నాడు. ఇక, అసలు విషయానికి వస్తే.. విటమిన్ డీ లోపం వల్ల వ్యాధి నిరోధక శక్తి దెబ్బ తింటుందని, ఎముకలు కూడా పొలుసుబారుతాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే, విటమిన్ డీ లోపం కారణంగా వైవాహిక జీవితం కూడా నాశనం అవుతుందని తాజా పరిశోధనల్లో తేలింది. విటమిన్ డీ లోపం కారణంగా ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ సమస్య వస్తుందని స్పెయిన్‌కు చెందిన టాక్సికాలజిస్టులు కనుగొన్నారు. అంగంలో కార్పోరా కావెర్నోశా అనే స్పాంజి లాంటి టిష్యూ ఉంటుంది. అది అంగాన్ని ఎక్కువ సేపు నిలకడగా ఉంచేలా చేస్తుంది. విటమిన్ డీ లోపం వల్ల ఆ టిష్యూపై ప్రభావం పడుతుంది. తద్వారా మగతనం దెబ్బతింటుంది.


భాగస్వామితో ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. యూకేలోని ప్రతీ 10 మందిలో ఒకరు విటమిన్ డీ లోపం వల్ల బాధపడుతున్నట్లు తేలింది. వీరిలో నల్లజాతీయులతో పాటు.. ఏషియాకు చెందిన వారు కూడా ఉన్నారు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రపంచంలోని 50 శాతం మంది మగాళ్లు ఎరక్టైల్ డిస్ ఫంక్షన్‌ బారినపడుతున్నారు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. ఎరక్టైల్ డిస్ ఫంక్షన్‌తో బాధపడేవారు ఎక్కువగా ఆ మందులు వాడుతున్నారు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా చనిపోతున్నారు. జీవన శైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఈ లోపాన్ని జయించవచ్చు. ఎండలో 10నుంచి 30 నిమిషాలు ఉండటం వల్ల.. విటమిన్ డీ అందే ఆహారం తీసుకోవటం వల్ల మేలు జరుగుతుంది.


ఇవి కూడా చదవండి

Actress Abhinaya: మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన నటి అభినయ

Gold Rate: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు

Updated Date - Apr 17 , 2025 | 12:08 PM