Share News

Cardio Vs Weighs For Heart: గుండె ఆరోగ్యానికి కార్డియో బెటరా లేక బరువులెత్తడం మంచిదా?

ABN , Publish Date - Apr 29 , 2025 | 11:34 AM

గుండె ఆరోగ్యం మెరుగు పరుచుకునేందుకు కార్డియో బెటరా లేక బరువులెత్తడం బెటరా అనే సందేహం ఉందా? అయితే, ఈ కథనం మీ కోసమే.

Cardio Vs Weighs For Heart: గుండె ఆరోగ్యానికి కార్డియో బెటరా లేక బరువులెత్తడం మంచిదా?
Cardio vs Weights

ఇంటర్నె్ట్ డెస్క్: ఫిట్‌గా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్‌సైజులకు మించి మార్గం మరొకటి లేదు. అయితే, కార్డియో తరహా కసరత్తులు చేయాలా లేక బరువులు ఎత్తే కసరత్తులు చేయాలా అని చాలా మందికి ఉండే సందేహం. చిన్న వయసులోనే హృద్రోగాలు పెరుగుతున్న నేటి జమానాలో గుండె ఆరోగ్యానికి కార్డియో, వెయిట్స్‌ రెండింట్లో ఏది మంచిదనే సందేహం కలుగుతుంటుంది. దీనికి నిపుణులు సవివరమైన సమాధానమే ఇస్తున్నారు.

బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఆరుబయట ఆడే ఆటలు వంటివన్నీ కార్డియో వాస్క్యులర్ లేదా ఎయిరోబిక్ ఎక్సర్‌సైజులగా పరిగణిస్తారు. రోజుకు 30 నుంచి 40 నిమిషాల పాటు వారానికి కనీసం నాలుగు నుంచి ఐదు సార్లు ఎయిరోబిక్ ఎక్సర్‌సైజులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

అయితే, తీవ్రమైన ఎక్సర్‌సైజులకు దిగే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలవాటు లేకపోతే వాటి జోలికే వెళ్లకూడదు. క్రమక్రమంగా ఎక్సర్‌సైజు తీవ్రతను పెంచుకుంటూ స్టామినా పెంచుకోవాలి. ఒక్కసారిగా భారీ కసరత్తులకు ప్రయత్నిస్తే మొదటికే ముప్పు వస్తుంది.


ఇక బరువులు ఎత్తడం లేదా రెసిస్టెన్స్ ట్రెయినింగ్ కసరత్తులు ప్రధానంగా కండరాలు బలోపేతం చేసేందుకు ఉపయోగపడతాయి. గుండెకు వీటితో ప్రత్యేకంగా జరిగే మేలు ఏదీ ఉండదని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్య పరంగా చూస్తే స్ట్రెంగ్త్ ట్రెయినింగ్‌తో పోలిస్తే కార్డియోతో ఉపయోగాలు ఎక్కువని చెబుతున్నారు.

కార్డియోతో బీపీ నియంత్రణలో ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. కొలెస్టెరాల్ స్థాయిలు కూడా తగ్గి బరువు తగ్గుతారు. అంతిమంగా ఇవన్నీ గుండెకు మేలు చేస్తాయి. వీటికి స్ట్రెంగ్త్ ట్రెయినింగ్ కూడా జత కూరిస్తే ప్రయోజనాలు మరింత అధికమవుతాయని నిపుణులు చెబుతున్నారు.


పరిపూర్ణమైన ఫిట్‌నెస్ సాధించాలంటే కార్డియో, రెసిస్టెన్స్ ట్రెయినింగ్ రెండూ అవసరమే. అయితే, ఆయా వ్యక్తుల ఆరోగ్యం, శారీరక దారుఢ్యం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని ఎక్సర్‌సైజులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగు పరుచుకోవాలనుకునే వారు మాత్రం కార్డియోపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.

ఇవి కూడా చదవండి:

రోజూ జిమ్‌కు వెళతారా? మీరు తెలుసుకోవాల్సిన తప్పనిసరి విషయాలు ఏంటంటే..

కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..

మధ్యాహ్నం నిద్రతో ఆరోగ్యానికి చేటు కలుగుతుందా?

Read Latest and Health News

Updated Date - Apr 29 , 2025 | 11:35 AM