Ginger First In the Morning: చలికాలంలో పొద్దున్నే అల్లం తింటే ఏం జరుగుతుందో తెలుసా?..
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:25 PM
అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ప్రతీ రోజూ పరగడుపున చిన్న అల్లం ముక్క తింటే ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. శ్వాస కోశాలు శుభ్రపడతాయి.
చలికాలం వచ్చిందంటే చాలు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. జలుబు ఈజీగా ఎటాక్ చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు అల్లం దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఊపిరితిత్తుల సమస్యలకు చెక్ పెడుతుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. ప్రతీ రోజూ పరగడుపున చిన్న అల్లం ముక్క తింటే ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది. శ్వాస కోశాలు శుభ్రపడతాయి. గాలి కాలుష్యం కారణంగా వచ్చే తీవ్రమైన జలుబు సమస్యకు కూడా అల్లం చెక్ పెడుతుంది.
2018లో అల్లంపై ‘టర్కిష్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ ఓ నివేదికను ప్రచురించింది. ఆ నివేదికలో అద్భుతమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అల్లం పరగడుపున తినటం వల్ల హైపరాక్సియా (హై లెవెల్ ఆక్సిజన్‌కు ఎక్స్‌పోజ్ అవ్వటాన్ని హైపరాక్సియా వస్తుంది. హైపర్ ఆక్సియా వల్ల ఆక్సిజన్ టాక్సిసిటీ, పక్షవాతం, ఊపిరితిత్తులు దెబ్బతినటంతో పాటు ఇతర సమస్యలు వస్తాయి. ) ఇన్‌ఫ్లమేషన్ సమస్యలు తగ్గుతాయని తేలింది. ఆస్థమా ఉన్న వారికి అల్లం బెస్ట్ రెమిడీ అవుతుంది.
అల్లం వల్ల కలిగే మరిన్ని ఉపయోగాలు..
జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చడంలో అల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్యాస్, అజీర్తి, బ్లోటింగ్, మలబద్ధక సమస్యలకు చెక్ పెడుతుంది.
ఆర్థరైటిస్ నొప్పి నుంచి అల్లం సాంత్వన చేకూరుస్తుంది.
రోగ నిరోధక శక్తిని పెంపొందించటంలోనూ అల్లం సాయపడుతుంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది.
ఇవి కూడా చదవండి
అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ
పత్తి కొనుగోళ్లపై గందరగోళం.. ఆందోళనలో అన్నదాతలు