Share News

Black Fungus On Onions: ఉల్లిగడ్డల మీద బ్లాక్ ఫంగస్.. తింటే ఏమవుతుందో తెలుసా?..

ABN , Publish Date - Nov 17 , 2025 | 07:08 AM

నల్లటి చారలు ఉన్న ఉల్లిగడ్డల్ని వాడటం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమా? బ్లాక్ ఫంగస్‌తో ఎలాంటి సమస్యలు వస్తాయి? అసలు బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిగడ్డల్ని తినొచ్చా?..

Black Fungus On Onions: ఉల్లిగడ్డల మీద బ్లాక్ ఫంగస్.. తింటే ఏమవుతుందో తెలుసా?..
Black Fungus On Onions

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లిగడ్డల్లో యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. క్వెర్సెటిన్, సల్ఫర్, ఫైబర్, విటమిన్ సీ, బీ6 పుష్కలంగా ఉంటాయి. ఉల్లిగడ్డల్ని ప్రతీ రోజూ తగిన మోతాదులో ఆహారంగా తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు బలంగా తయారు అవుతాయి. వ్యాధి నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. వాస్తవానికి ఉల్లిగడ్డలు లేకుండా కూరలు చేయటం అన్నది అసాధ్యమే అని చెప్పాలి. వంటల్లోకే కాకుండా సలాడ్ లాగా పచ్చి ఉల్లిగడ్డల్ని కూడా తినవచ్చు.


బ్లాక్ ఫంగస్ ప్రమాదమా?..

కొన్ని ఉల్లిగడ్డలపై నల్లటి చారలు ఉండటం గమనించే ఉంటారు. చాలా మందికి నల్లటి చారల గురించి సరైన అవగాహన లేదు. నల్లటి చారల్ని కడిగేసి ఉల్లిగడ్డల్ని వంటల్లో వాడేస్తూ ఉంటారు. ఉల్లిగడ్డలపై ఉండే నల్లటి చారలు సాధారణమైనవి కావు. అవి ఆస్పెర్గిల్స్ నైజర్ అనే బ్లాక్ ఫంగస్ కారణంగా కారణంగా ఏర్పడతాయి. బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిగడ్డల్ని తింటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. ముకోర్మైకోసిస్ అనే అరుదైన ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఎంత కడిగినా.. ఉడకబెట్టినా బ్లాక్ ఫంగస్ చావదు. దీర్ఘ కాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మరి బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిగడ్డల్ని ఏం చేయాలి?..


డాక్టర్ నందితా అయ్యర్ బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిగడ్డలను ఎలా వాడాలో వివరించారు. ఆమె మాట్లాడుతూ.. ‘గాలి తగలని ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల వాటిపై బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుంది. బ్లాక్ ఫంగస్ ఉన్న ఉల్లిగడ్డల్ని పాడేయాల్సిన అవసరం లేదు. బ్లాక్ ఫంగస్ ఉన్న పొరను మాత్రమే తీసేస్తే సరిపోతుంది. ఆ పొరను తీసేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి, ఉడకబెట్టి తినాలి. బ్లాక్ ఫంగస్ ఎన్ని పొరల్లో ఉంటే అన్ని పొరల్ని తీసేసి మిగితాది వాడొచ్చు. ఉల్లిగడ్డ వాసన వస్తున్నా.. రుచి బాగోలేకపోయినా పక్కన పడేయండి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

అహాన్ మొదటి బర్త్ డే.. రోహిత్ ఇంట్లో వేడుకలు.. హిట్‌మ్యాన్ ఎమోషనల్ పోస్ట్..

సఫారీలు అదుర్స్‌ సీన్‌ రివర్స్‌

Updated Date - Nov 17 , 2025 | 07:18 AM