Share News

Health Insurance: ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా 10 లక్షలకు పెంపు.. ఎలా అప్లై చేయాలంటే ..

ABN , Publish Date - Nov 26 , 2025 | 09:57 AM

'ఆయుష్మాన్ భారత్.. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన' పథకం ప్రయోజనాన్ని కేంద్రం మరింత విస్తరించింది. దీని ద్వారా లభించే రూ.5లక్షల బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచారు. ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం రూ.10లక్షల వరకూ ఉచితంగా లభిస్తుంది.

Health Insurance: ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా 10 లక్షలకు పెంపు.. ఎలా అప్లై చేయాలంటే ..
Health Insurance

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్.. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం బీమా కవరేజీని పెంచారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ రూ.5లక్షల ఆరోగ్య బీమాను అందిస్తున్నారు. అయితే అర్హులైన కుటుంబాలకు ఈ బీమా కవరేజీని రూ.10లక్షలకు పెంచారు. వయోపరిమితి 70 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్ల కోసం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.


PM-JAY పథకం వివరాలు..

పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోడానికి PM-JAY పథకాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో క్యాష్‌లెస్, పేపర్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. దీని ద్వారా రూ.10లక్షల ఆరోగ్య బీమా కవరేజీ లభిస్తుంది. ఈ పథకం ద్వారా ముందుగా ఉన్న అన్ని వ్యాధులు మొదటి రోజు నుండే కవర్ అవుతాయి. దీర్ఘకాలిక వైద్య సమస్యలు ఉన్న కుటుంబాలూ ఈ పథకం ద్వారా పూర్తి బీమా కవరేజీని పొందవచ్చు. దీనికి ఎలాంటి వయోపరిమితి, లింగ పరిమితి లేదు.


70 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఇప్పుడు అదనంగా రూ.5లక్షల బీమా కవరేజీ ఉంటుంది. కుటుంబానికి లభించే ఇన్సూరెన్స్ కవరేజీకి ఇది అదనం. దీని వల్ల ఫ్యామిలీ మొత్తం బీమా కవరేజీ రూ.10 లక్షలకు చేరుకుంటుంది. ఈ పథకం కోసం ఆధార్ కార్డు ప్రకారం 70 ఏళ్లు దాటిన వ్యక్తులు ఈ అదనపు బీమా కవరేజీ పొందేందుకు అర్హులు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇవాళ పెరిగిన వెండి, బంగారం ధరలు

మావోయిస్టుల కస్టడీ పిటిషన్‌ వెనక్కి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 26 , 2025 | 01:16 PM