Biotin Power Foods: జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి కచ్చితంగా తినాల్సిందే..
ABN , Publish Date - Oct 27 , 2025 | 03:11 PM
విటమిన్స్ లోపం ఉంటే జట్టు విపరీతంగా ఊడిపోతుంది. మరీ ముఖ్యంగా బయోటిన్ లోపం ఉంటే జుట్టుపై చాలా ప్రభావం పడుతుంది. జుట్టుకు అవసరమైన కెరాటిన్‌ను తయారు చేయటంలో బయోటిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.
నల్లటి, ఒత్తైన జుట్టు కావాలని ఎవరు మాత్రం అనుకోరు. కేవలం ఆడవారే కాదు.. మగవారికి కూడా జుట్టు ఊడిపోవటం అన్నది ఓ ప్రధాన సమస్యగా మారిపోయింది. వందలు, వేలు పెట్టి ఆయిల్స్, షాంపులు వాడినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదు. అయితే, జట్టు ఊడిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో ప్రధానమైనది పోషకాల లోపం. విటమిన్స్ లోపం ఉంటే జట్టు విపరీతంగా ఊడిపోతుంది. మరీ ముఖ్యంగా బయోటిన్ లోపం ఉంటే జుట్టుపై చాలా ప్రభావం పడుతుంది. ఎందుకంటే జుట్టుకు అవసరమైన కెరాటిన్‌ను తయారు చేయటంలో బయోటిన్(Hair Growth Indian Foods) ప్రధాన పాత్ర పోషిస్తుంది. బయోటిన్ సరైన స్థాయిలో అందకపోతే కెరాటిన్ తయారీపై ప్రభావం పడుతుంది. అందుకే బయోటిన్ పుష్కలంగా ఉండే ఈ 5 ఆహారాలను డైట్‌లో తప్పని సరిగా చేర్చుకోవాలి.
గుడ్లు
నాన్ వెజ్ తినే వారికి గుడ్లు బెస్ట్ చాయిస్. గుడ్లలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. అంతే కాదు ప్రొటీన్ కూడా అధికంగా ఉంటుంది. ఈ రెండు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడతాయి. ప్రతీ రోజూ ఉడకబెట్టిన గుడ్లు కానీ, ఆమ్లెట్ కానీ తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. (Biotin Rich Indian Diet)
బాదాం
బాదాంలో బయోటిన్, విటమిన్ ఈ, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ప్రతీ రోజూ 10 బాదాం గింజల్ని తింటే జుట్టు చాలా సిల్కీగా తయారు అవుతుంది. వెంట్రుకలు విరిగిపోకుండా కూడా ఉంటాయి. ప్రతీ రోజూ ఉదయం నాన బెట్టిన బాదాం గింజల్ని తీసుకోవటం చాలా మంచిది.
స్వీట్ పొటాటో
స్వీట్ పొటాటోలో బయోటిన్ అధికంగా ఉంటుంది. బయోటిన్‌తో పాటు బీటా కెరోటిన్ జుట్టుకు అవసరమైన ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ప్రతీ రోజూ స్వీట్ పొటాటో తింటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
శనగలు
శనగల్లో కేవలం బయోటిన్ మాత్రమే కాదు.. ప్రొటీన్, ఐరన్, జింక్ కూడా అధిక మొత్తంలో ఉంటాయి. అవి మన జుట్టును రూట్స్ నుంచి ఆరోగ్యంగా చేస్తాయి. (Natural Hair Care)
పాలకూర
జుట్టును ఆరోగ్యంగా ఉంచే ఆకు కూరల్లో పాలకూర మొదటి స్థానంలో ఉంటుంది. ఇందులో బయోటిన్, ఐరన్, ఫోలెట్, విటమిన్ సీ అధికంగా ఉంటాయి. ఐరన్ కారణంగా జుట్టు ఊడిపోతూ ఉంటే.. ఆ సమస్యను పాలకూర ఇట్టే పరిష్కరిస్తుంది.
ఇవి కూడా చదవండి
జుట్టుకు రంగు వేసుకుంటారా? తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే...
డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన: CBI దర్యాప్తు అవకాశం