Share News

Jubilee Hills bypoll exit poll results: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. గెలుపు వారిదేనట..!

ABN , Publish Date - Nov 11 , 2025 | 06:39 PM

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్ సర్వే నివేదికలు వచ్చేశాయ్. జూబ్లీహిల్స్‌లో జయకేతనం ఎగురవేసేది ఎవరనే విషయాన్ని రిజల్ట్స్‌కు ముందే చెప్పేశాయ్. అక్టోబర్ 13వ తేదీ నుంచి మొదలైన.. ఈ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా..

Jubilee Hills bypoll exit poll results: ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. గెలుపు వారిదేనట..!
Exit poll reports

హైదరాబాద్, నవంబర్ 11: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్ సర్వే నివేదికలు వచ్చేశాయ్. జూబ్లీహిల్స్‌లో జయకేతనం ఎగురవేసేది ఎవరనే విషయాన్ని రిజల్ట్స్‌కు ముందే చెప్పేశాయ్. అక్టోబర్ 13వ తేదీ నుంచి మొదలైన.. ఈ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు హోరాహోరీగా తలపడ్డాయి. పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించాయి. ఇంత చేసిన పార్టీలకు.. ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు. సర్వే సంస్థలు.. ఓటర్ల నాడిని పసిగట్టాయా? ఓటర్ల అభిప్రాయం ప్రకారం జూబ్లీహిల్స్‌లో ఏ పార్టీ గెలువనుంది? సర్వే సంస్థలు ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలు మీకోసం..


జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌ వైపే ఓటర్లు

  • పబ్లిక్‌ పల్స్‌: కాంగ్రెస్‌ 48.5%, BRS 41.8%, BJP 6.5% ఓట్లు

  • చాణక్య స్ట్రాటజీస్‌: కాంగ్రెస్‌ 46%, BRS 43%, BJP 6% ఓట్లు

  • నాగన్న సర్వే: కాంగ్రెస్‌ 47%, BRS 41%, BJP 8% ఓట్లు

  • ఆపరేషన్‌ చాణక్య: 8 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌దే విజయమని సర్వే

  • JANMINE సర్వే: కాంగ్రెస్‌ 42.5%, BRS 41.5%, BJP 11.5% ఓట్లు

  • HMR సర్వే: కాంగ్రెస్‌ 48.31%, BRS 43.18%, BJP 5.84% ఓట్లు

  • స్మార్ట్‌పోల్‌: కాంగ్రెస్‌ 48.2%, BRS 42.1%, BJP 7.6% ఓట్లు


exit-polls.jpg

Updated Date - Nov 11 , 2025 | 07:16 PM