Share News

NEET PG Counselling 2025: కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే..

ABN , Publish Date - Nov 20 , 2025 | 04:14 PM

మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ(MCC) నీట్ పీజీ రౌండ్ 1 కౌన్సిలింగ్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. కౌన్సిలింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలను..

NEET PG Counselling 2025: కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే..
NEET PG Counselling 2025

NEET PG Counselling 2025: మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ(MCC) నీట్ పీజీ రౌండ్ 1 కౌన్సిలింగ్‌కు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. కౌన్సిలింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలను అధికారిక పోర్టల్ mcc.nic.in లో చూడవచ్చు. ఎంసీసీ ప్రకటన ప్రకారం.. నీట్ పీజీ కౌన్సిలింగ్ తేదీలు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

రివైజ్‌డ్ షెడ్యూల్ ప్రకారం.. రౌండ్ 1 కౌన్సిలింగ్ కోసం విండో నవంబర్ 20వ తేదీన ఓపెన్ అవుతుంది. మరుసటి రోజు అంటే నవంబర్ 21వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ విండో క్లోజ్ అవుతుంది. సీట్ల ప్రాసెసింగ్ నవంబర్ 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. రౌండ్ 1 సీట్ల కేటాయింపునకు సంబంధించిన రిజల్ట్స్ నవంబర్ 22న ప్రకటించనున్నారు. ఇక ఈ రౌండ్‌లో సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు తమకు కేటాయించిన విద్యా సంస్థలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.


ఆప్షన్స్ ఎలా పెట్టాలి..

నీట్ పీజీ కౌన్సిలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు.. ఆయా కాలేజీల్లో సీటు కోసం ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలో స్టెప్ బై స్టెప్ వివరాలు..

1. ముందుగా MCC(mcc.nic.in) అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

2. ఆ తరువాత నీట్ పీజీ కౌన్సిలింగ్ 2025 రౌండ్ 1 రిజిస్ట్రేషన్ అని కనిపించే లింక్‌పై క్లిక్ చేయాలి.

3. అవసరమైన వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.

4. ఇప్పుడు మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి.

5. మీకు నచ్చిన కాలేజీని ఎంపిక చేసుకుని సబ్‌మిట్ చేయాలి.

6. ఆ తరువాత మీరు ఎంచుకున్న కాలేజీలకు సంబంధించి ప్రింట్ ప్రివ్యూ కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు సంబంధించి సమగ్ర సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక MCC వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.


Also Read:

ఇండియాకు 'జావెలిన్ మిస్సైల్' ఎంట్రీ.. దీని గురించి తెలుసా.?

ఆరేళ్ల తరువాత కోర్టుకు జగన్.. మూడు నిమిషాల్లోనే

Updated Date - Nov 20 , 2025 | 04:15 PM