Share News

Indian Army Recruitment 2025: ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త!

ABN , Publish Date - Jul 20 , 2025 | 01:37 PM

ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేయవచ్చు.

Indian Army Recruitment 2025: ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త!
Indian Army Recruitment 2025

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులకు శుభవార్త.. ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేయవచ్చు. దరఖాస్తు చేసుకునే ముందు అభ్యర్థులు అర్హతలు, వయసు పరిమితి, విద్యార్హతలు, సెలెక్షన్ ప్రాసెస్, ఇతర ముఖ్యమైన సూచనలు వంటి వివరాలను పూర్తిగా తెలుసుకోండి.


భారత సైన్యం 66వ షార్ట్ సర్వీస్ కమిషన్ (టెక్) ఏప్రిల్ 2026 కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించింది. దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు (పురుషులు, మహిళలు) joinindianarmy.nic.in ఈ వెబ్ సైట్‌కు వెళ్లి అప్లై చేయవచ్చు. ఆగస్టు 14, 2025 దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ. 379 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఈ ఎంపిక జరుగుతుంది.


అర్హతలు, ఎంపిక విధానం:

  • వ్యక్తులు భారత పౌరసత్వం కలిగి ఉండాలి.

  • అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

  • చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా అర్హులు.

  • ఏ రాత పరీక్ష ఉండదు. అకడమిక్ మెరిట్ (Marks/CGPA) ఆధారంగా ఎంపిక ఉంటుంది.

  • ఎంపికైన అభ్యర్థులకు SSB ఇంటర్వ్యూ ఉంటుంది.

  • వయోపరిమితి: ఏప్రిల్ 1, 2026 నాటికి 20 నుండి 27 సంవత్సరాలు ఉండాలి.


ఎలా దరఖాస్తు చేయాలి?

షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోసం ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం..

  • అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి - www.joinindianarmy.nic.in

  • 'ఆఫీసర్ ఎంట్రీ అప్లికేషన్, లాగిన్' పై క్లిక్ చేయండి.

  • కొత్తవారు అయితే 'రిజిస్ట్రేషన్' పై క్లిక్ చేసి వివరాలు నింపి రిజిస్టర్ చేసుకోండి.
    మీరు ఇప్పటికే రిజిస్టరై ఉంటే లాగిన్ చేయండి.

  • రిజిస్టర్ అయిన తర్వాత, డాష్‌బోర్డ్ కింద 'ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి' పై క్లిక్ చేయండి.

  • 'ఆఫీసర్స్ సెలక్షన్ - అర్హత' అనే పేజీ ఓపెన్ అవుతుంది.

  • మీరు అప్లై చేయాలనుకుంటున్న కోర్సు దగ్గర కనిపించే అప్లై బటన్‌పై క్లిక్ చేయండి.
    ఉదా: షార్ట్ సర్వీస్ కమిషన్ NAC స్పెషల్ ఎంట్రీ కోర్సు

  • ఇప్పుడు దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది.


ఫారం ఎలా నింపాలి?

  • ముందుగా సూచనలు/ఇన్‌స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదవండి. తరువాత, కొనసాగించుపై క్లిక్ చేసి అందులోని విభాగాల్లో వివరాలు నింపండి:

  • వ్యక్తిగత సమాచారం (Personal Info)

  • సంప్రదింపు వివరాలు (Contact Info)

  • విద్య వివరాలు (Educational Info)

  • మునుపటి SSB అటెంప్ట్‌లు ఉన్నట్లయితే, వాటి వివరాలు

  • ప్రతి సెక్షన్ పూర్తి చేసిన తర్వాత 'సేవ్ & కంటిన్యూ' బటన్‌ను నొక్కండి.


ఎంపిక విధానం:

  • దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్

  • SSB ఇంటర్వ్యూ – ఇది 5 రోజుల ప్రక్రియ

  • వైద్య పరీక్ష (Medical Test)

  • ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు (Joining Letter)

  • మీరు ఇచ్చే వివరాలు పూర్తిగా కరెక్ట్‌గా ఉండాలి.

  • అవసరమైన సర్టిఫికెట్లు స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోండి.

  • చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేయండి – ఆగస్టు 14, 2025

Updated Date - Jul 20 , 2025 | 01:42 PM