Share News

CAT 2025: CAT 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పరీక్ష షెడ్యూల్ తెలుసుకోండి

ABN , Publish Date - Aug 01 , 2025 | 10:57 AM

CAT 2025 కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? నోటిఫికేషన్, పరీక్ష తేదీలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

CAT 2025: CAT 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పరీక్ష షెడ్యూల్ తెలుసుకోండి
CAT 2025

ఇంటర్నెట్ డెస్క్‌: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన MBA ప్రవేశ పరీక్ష అయిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2025 రిజిస్ట్రేషన్ ప్రకియ నేడు ప్రారంభమయింది. ఈ సంవత్సరం ఈ పరీక్షను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) కోజికోడ్ నిర్వహిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

CAT (Common Admission Test) అనేది భారతదేశంలోని IIMలు (Indian Institutes of Management), ఇతర ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో ఎంబీఏ (MBA), పిహెచ్‌డి PHD లేదా మేనేజ్‌మెంట్ కోర్సులకు అడ్మిషన్ కోసం నిర్వహించే జాతీయస్థాయి ప్రవేశ పరీక్ష.


దరఖాస్తు విధానం:

  • iimcat.ac.in వెబ్‌సైట్‌కి వెళ్లండి

  • కొత్తగా రిజిస్టర్ చేసుకోండి

  • దరఖాస్తు ఫారమ్ ఫిల్ చేయండి

  • డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి

  • ఫీజు చెల్లించండి

  • కన్ఫర్మేషన్ రిసీప్ట్ సేవ్ చేసుకోండి

పరీక్ష తేదీ, షెడ్యూల్

  • పరీక్ష తేదీ: నవంబర్ 30, 2025 (ఆదివారం)

  • సెషన్‌లు: ఒకే రోజులో 3 సెషన్‌లు

  • అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: నవంబర్ 5 నుండి నవంబర్ 30, 2025 వరకు

  • ఫలితాల తేదీ (తాత్కాలిక): జనవరి 2026 మొదటి వారం


ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

CAT 2025 కి దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న కనీస మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.

రిజిస్ట్రేషన్ ఫీజులు

  • SC/ST/PwD: రూ. 1,300

  • అన్ని ఇతర వర్గాలు: రూ. 2,600

మీరు ఎన్ని IIMలు లేదా ఇతర సంస్థలు ఎంచుకున్నా, CAT అప్లికేషన్ ఫీజు ఒక్కసారి మాత్రమే చెల్లించాలి. అంటే, మీరు ఫారమ్‌లో 4 IIMలు ఎంపిక చేసుకున్నా, 10 IIMలు ఎంపిక చేసుకున్నా.. ఫీజు మళ్ళీ మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు.


Also Read:

బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి హాని.!

బేకింగ్ సోడా Vs బేకింగ్ పౌడర్.. ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?

Updated Date - Aug 01 , 2025 | 11:02 AM