AP Constable Results Released: కానిస్టేబుల్ ఫలితాలు విడుదల .. ఇలా చెక్ చేసుకోండి
ABN , Publish Date - Aug 01 , 2025 | 11:17 AM
ఏపీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.

మంగళగిరి: ఏపీ పోలీస్ శాఖకు సంబంధించిన కానిస్టేబుల్ పోస్టుల తుది ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ ద్వారా పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
హోం మంత్రి అనిత మాట్లాడుతూ కానిస్టేబుల్ నియామక ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించామన్నారు. ఫలితాలలో గండి నానాజీ (విశాఖపట్నం) మొదటి స్థానం సాధించగా, రమ్య మాధురి (విజయనగరం) రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానం అచ్యుత రావు (రాజమండ్రి) దక్కించుకున్నారు.
మొత్తం ఖాళీ పోస్టులు: 6,100
అభ్యర్థుల దరఖాస్తులు: 5.3 లక్షలు
పరీక్షకు హాజరైన వారు: 4.59 లక్షలు
ఫైనల్ రౌండ్‌కి అర్హత పొందిన అభ్యర్థులు: 33,921 మంది
ట్రైనింగ్ & పోస్టింగ్ వివరాలు:
ట్రైనింగ్ ప్రారంభం: సెప్టెంబర్ 2025
పూర్తి ట్రైనింగ్ గడువు: 9 నెలలు
అనంతరం పోస్టింగ్‌లు కల్పిస్తామని హోం మంత్రి తెలిపారు.
Also Read:
CAT 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పరీక్ష షెడ్యూల్ తెలుసుకోండి
యూపీఐ కొత్త రూల్స్.. నేటి నుంచి అమలులోకి!