Share News

Inter Supplementary Results 2025: ఫలితాలొచ్చేశాయ్..

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:35 AM

AP Inter Supplementary Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు

Inter Supplementary Results 2025: ఫలితాలొచ్చేశాయ్..
AP Inter Supplementary Results 2025

AP Inter Supplementary Results 2025: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో(resultsbie.ap.gov.in) చెక్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యా మండల(BIEAP) శనివారం నాడు ఇంటర్మీడియట్ 1, 2 సంవత్సరాలకు సంబంధించి సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు ఈ లింక్ క్లిక్ చేసి తమ ఫలితాలను చూడవచ్చు.

అధికారిక వెబ్‌సైట్‌లో ఎలా చెక్ చేయాలంటే..

  • విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు.

  • ముందుగా resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

  • ‘AP 1st or 2nd Year Supplementary Results 2025’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

  • ఆ తరువాత మీ హాల్ టికెట్ నెంబర్‌‌ని, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమదు చేయాలి.

  • మీ ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

  • భవిష్యత్ అవసరాల కోసం ఈ ఫలితాలకు సంబంధించి సాఫ్ట్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.


వాట్సాప్‌లోనూ ఫలితాలు..

ఇంటర్ విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక పోర్టల్‌తో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మన మిత్ర వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా కూడా పొందవచ్చు. వాట్సాప్ ద్వారా ఫలితాను ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

  • ముందుగా వాట్సాప్‌లో 9552300009 కు ‘హాయ్’ అని మెసేజ్ పెట్టాలి.

  • ఆటోమేటెడ్ ప్రాంప్ట్‌ల కోసం వేచి ఉండండి.

  • అవసరమైన వివరాలను సమర్పించాలి.

  • మీ స్కోర్‌కార్డ్ మీకు నేరుగా చాట్‌లో పంపబడుతుంది.

కాగా, ఈ సంవత్సరం ప్రారంభంలో ఏప్రిల్ 12న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష (IPE) ఫలితాలు ప్రకటించారు. ఈ ఫలితాల్లో మొదటి సంవత్సరం విద్యార్థుల 67 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. రెండవ సంవత్సరం విద్యార్థులు 83 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మెయిన్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిన వారికి గత మే నెలలో సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫలితాలను శనివారం నాడు విడుదల చేశారు.


Also Read:

కొత్త పార్టీ పెడుతున్న మస్క్

కాంగ్రెస్‌ పాలనలో అన్నీ దందాలు.. చందాలే: కేటీఆర్‌

ట్రంప్‌కు షాక్.. మస్క్‌కు అండగా రష్యా..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 07 , 2025 | 11:49 AM