Share News

ఆ రాశివారికి ఈ వారం సర్వత్రా అనుకూలమే..

ABN , Publish Date - Jun 08 , 2025 | 07:23 AM

ఆ రాశి వారికి ఈ వారం తలపెట్టిన కార్యం నెరవేరుతుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. ఖర్చులు విపరీతంగా ఉంటాయని, ఆధ్యాత్మికత పెంపొందుతుంది తెలుపుతున్నారు. ఇంకా ఈవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఆ రాశివారికి ఈ వారం సర్వత్రా అనుకూలమే..

అనుగ్రహం

8 - 14 జూన్‌ 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఖర్చులు విపరీతం. కష్టసమయంలో ఆప్తులు ఆదుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మందకొడిగా సాగుతాయి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

శ్రమించిన కొద్దీ మంచి ఫలితా లుంటాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఒత్తిళ్లకు గురికావద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. పెద్దల హితవు కార్యోన్ముఖు లను చేస్తుంది. దృఢసంకల్పంతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితులతో తరచూ సంభాషి స్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. మీ నిర్లక్ష్యం ఇబ్బందులకు దారి తీస్తుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

ఆర్థికస్థితి నిరాశాజనకం. నిస్తేజానికి లోనవుతారు. చిన్న చిన్న ఒత్తిళ్లున్నా మనోధైర్యం కోల్పోవద్దు. రావలసిన ధనం ఆలస్యంగా అందుతుంది. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. చేపట్టిన పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. లావా దేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. తొందరపాటు నిర్ణయం తగదు. పెద్దల సలహా తీసుకోండి. వేడుకకు హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివెళ్లకండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

కార్యం సిద్థిస్తుంది. బాధ్యత లను సక్రమంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన విషయాల్లో లౌక్యంగా మెలగండి. ఏ విష యాన్నీ తేలికగా తీసుకోవద్దు. పరిచయస్తు లకు సాయం అందిస్తారు. ప్రభుత్వ కార్యాల యాల్లో పనులు సానుకూలమవుతాయి. అనవసర విషయాల్లో జోక్యం తగదు. కొత్త యత్నాలు మొదలెడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. అనుమానాలు, అపోహలకు తావివ్వవద్దు.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

విశేష ఫలితాలున్నాయి. అను కున్న కార్యం సాధిస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. పిల్లల చదువులపై దృష్టిపెడతారు. ఒక ఆహ్వానం ఆలోచింప చేస్తుంది. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఒత్తిళ్లకు గురికావద్దు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. లావాదేవీల్లో మెలకువ వహించండి. ప్రలోభా లకు గురికావద్దు. అనుభవజ్ఞులను సంప్రదిం చండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

మీ తప్పిదాలు సరిదిద్దుకోండి. ఇతరులను నిందించవద్దు. దృఢసంకల్పంతో యత్నాలు సాగించండి. ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. బంధుమిత్రులతో తరుచూ సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్తేజపరు స్తుంది. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. వ్యవహారాల్లో ఆచితూచి అడుగేయండి. ఒంటెద్దుపోకడ తగదు. కీలక పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

ప్రతికూలతలు అధికం. లక్ష్య సాధనకు మరింత శ్రమించాలి. ఆశావహ దృక్పథంతో మెలగండి. అపజయాలకు కుంగి పోవద్దు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. సన్నిహితు లతో కాలక్షేపం చేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. యత్నాలను కుటుంబీకులు ప్రోత్సహిస్తారు. కనిపించ కుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

ప్రతికూలతలను అధిగమి స్తారు. అవకాశాలు కలిసివస్తాయి. లౌక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు, ఆదాయం బాగుంటుంది. విలాసాలకు ఖర్చు చేస్తారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మీ కష్టం ఫలిస్తుంది. వస్త్ర ్తప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. సమర్థతను చాటుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. నిలిపివేసిన పనులు పునః ప్రారంభిస్తారు. సభ్యత్వాలు స్వీకరిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసు కుంటారు. అంచనాలు ఫలిస్తాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. ఎవరినీ అతిగా నమ్మవద్దు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

సర్వత్రా అనుకూలమే. ఏకార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఆదాయం బాగుంటుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలి స్తాయి. ప్రణాళికాబద్థంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని సంఘటన ఎదురవు తుంది. పెద్దల చొరవతో సమస్య సద్దుమణు గుతుంది. శుభకార్యం తలపెడతారు. సన్మాన, సంస్మరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సమస్యలను నిబ్బరంగా ఎదుర్కొం టారు. మీ కార్యదీక్ష ప్రశంసనీయమవుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. నగదు చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. కొత్తవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి.



ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు..

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 08 , 2025 | 07:23 AM