Share News

ఆ రాశి వారికి ఈ వారం ధనలాభం ఫుల్..

ABN , Publish Date - Aug 03 , 2025 | 06:57 AM

ఆ రాశి వారికి ఈ వారం ధనలాభం ఫుల్‏గా ఉంటుందని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. మనోధైర్యంతో ముందుకు సాగుతారని, చెల్లింపులు వాయిదా వేసుకుంటారని తెలుపుతున్నారు. అంతేగాక వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారని, గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుందని తెలుపుతున్నారు. ఇంకా ఈ వారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఆ రాశి వారికి ఈ వారం ధనలాభం ఫుల్..

అనుగ్రహం

3 - 9 ఆగస్టు 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

సర్వత్రా శుభదాయకం. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు విపరీతం. ఆప్తులను విందుకు ఆహ్వానిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. వివాహ యత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. గత అనుభవంతో తప్పిదాన్ని సరిదిద్దుకుంటారు. ప్రయాణం తలపెడతారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. వెండి, బంగారాలు కొనుగోలు చేస్తారు. చిట్స్‌, ఫైనాన్స్‌ వ్యాపారుల జోలికి పోవద్దు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. కొత్త యత్నాలు చేపడ తారు. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. మీ చొరవతో ఒకరికి మంచి జరుగుతుంది. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. చాకచక్యంగా అడుగులేస్తారు. ఖర్చులు అధికం, సంతృప్తికరం. కష్టమను కున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయినవారితో సంప్ర దింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. కొత్త సమస్యలెదురవుతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

ఆర్థికంగా విశేష ఫలితాలు న్నాయి. ధనలాభం ఉంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. మధ్యవర్తులను ఆశ్రయించవద్దు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం తగదు. ఇత రులను మీ విషయాలకు దూరంగాఉంచండి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

ప్రియతముల వ్యాఖ్యలు ఉత్తేజపరుస్తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. పనులు, బాధ్య తలు అప్పగించవద్దు. కీలక వ్యవహారంలో జాగ్రత్త వహించండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. మీ శ్రీమతికి ప్రతి విషయం తెలియజేయండి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు గురికావద్దు. మీ నిర్ణయంపైనే కుటుంబ భవిష్యత్తు ఆధారపడి ఉంది. పెద్దల సలహా పాటించండి. సన్నిహి తుల కలయిక వీలుపడదు. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్తిమితంగా ఉండ టానికి యత్నించండి. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఆత్మీయులతో సంభాషి స్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వేడుకకు హాజరవుతారు.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

ఆదాయ వ్యయాలు సంతృప్తి కరం. వస్త్ర, వెండి, బంగారాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడు పుతారు. గృహం సందడిగా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. వ్యవహారాల్లో తొందర పాటు నిర్ణయం తగదు. పెద్దల సలహా పాటించండి. మొహమాటాలు, భేషజాలకు పోవద్దు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

శుభసమయం ఆసన్నమైంది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. ముఖ్యమైన అంశాలపై పట్టు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెల గండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. దైవకార్యానికి విపరీతంగా ఖర్చు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. మీ ప్రమే యంతో ఒకరికి మంచి జరుగుతుంది.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

లక్ష్యసాధనకు చేరువలో ఉన్నారు. యత్నాలు విరమించుకోవద్దు. పెద్దల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. ఉత్సాహంగా ముందుకు సాగు తారు. పనులు, బాధ్యతలు పురమాయించ వద్దు. అందరితోనూ మితంగా సంభాషించండి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. ఆప్తు లను విందులకు ఆహ్వానిస్తారు. ఖర్చులు అధికం. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థలెదుర్కొంటారు.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్య తొలగుతుంది. మానసికంగా కుదుటపడతారు. సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. చేస్తున్నపనులు అర్థాంతరంగా ముగించవలసి వస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. గృహాలంకరణ పట్ల ఆసక్తి కలుగుతుంది.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

వ్యవహారానుకూలత ఉంది. అనుకున్న లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొన్ని విషయాలు ఊహించినట్టే జరుగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. పనులు చురు కుగా సాగుతాయి. అనవసర విషయాలు పట్టించుకోవద్దు. పెద్దల చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

ఆశావహదృక్పథంతోయత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. కలిసివచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. పెద్దల ప్రోత్సాహం ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు పురమాయించవద్దు. సన్నిహితులను విందుకు ఆహ్వానిస్తారు. కని పించకుండా పోయిన వస్తువులు లభ్యమవు తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.

Updated Date - Aug 03 , 2025 | 06:57 AM