Share News

ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో అస్సలు తీరిక ఉండదు..

ABN , Publish Date - Apr 20 , 2025 | 07:52 AM

ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో అస్సలు తీరిక ఉండదని జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. కొన్ని వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దని, ఉత్సాహంగా శ్రమించండం మంచిదని కూడా సూచిస్తున్నారు. అంతేగాక... మీ కృషి నిదానంగా ఫలిస్తుందని తెలుపుతున్నారు.

ఆ రాశి వారికి ఈ వారం లావాదేవీలతో అస్సలు తీరిక ఉండదు..

అనుగ్రహం

20 - 26 ఏప్రిల్‌ 2025

పి.ప్రసూనా రామన్‌

మేషం

అశ్విని, భరణి,

కృత్తిక 1వ పాదం

లావాదేవీలతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచించి ముందుకు సాగండి. తొందరపాటు నిర్ణయం తగదు. ఒత్తిళ్లకు గురికావద్దు. పనులు అస్త వ్యస్తంగా సాగుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఆప్తులకు మీ ఇబ్బందులు తెలియజేయండి. పత్రాలు అందుకుంటారు. శుక్రవారం నాడు ఫోన్‌ సందేశాలను పట్టించుకోవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పిల్లల చదువులపై దృష్టి సారిస్తారు.


వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,

మృగశిర 1,2 పాదాలు

అన్ని విధాలా యోగదాయకమే. అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు మొదలెడతారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మీ జోక్యం అనివార్యం. ఏకా గ్రతతో బాధ్యతలు నిర్వహించండి. దుబారా ఖర్చులు విపరీతం. కీలక పత్రాలు అందుకుం టారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి.


మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర,

పునర్వసు 1,2,3 పాదాలు

కృషి ఫలిస్తుంది. ఏ కార్యం తలపెట్టినా విజయవంతమవుతుంది. అను రాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మీ ఇష్టాయి ష్టాలను వెంటనే తెలియజేయండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. వాహనం కొనుగోలు చేస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి అతి చొరవ ఇబ్బంది కలిగిస్తుంది. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి.


కర్కాటకం

పునర్వసు 4వ

పాదం, పుష్యమి, ఆశ్లేష

ఈ వారం కలిసివచ్చే సమయం. నిరుత్సాహం వీడి శ్రమించండి. మీ కృషి తక్షణం ఫలిస్తుంది. ఒక సమస్య మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది. అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. వేడుకను ఘనంగా చేస్తారు. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.


సింహం

మఖ, పుబ్బ,

ఉత్తర 1వ పాదం

పరిస్థితులు చక్కబడతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. శుభకార్యం నిశ్చయమ వుతుంది. వేదికలు అన్వేషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు. మంగళ వారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వా దాలకు దిగవద్దు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టిపెడతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.


కన్య

ఉత్తర 2,3,4; హస్త,

చిత్త 1,2 పాదాలు

గ్రహస్థితి ఏమంత అను కూలం కాదు. ప్రతి విషయంలోనూ అప్ర మత్తంగా ఉండాలి. మీ తప్పిదాలను సరిదిద్దు కోవటానికి యత్నించండి. రావలసిన ధనం లౌక్యంగా రాబట్టుకోవాలి. ఖర్చులు అధికం. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగి స్తారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. చర్చల్లో పాల్గొంటారు.


తుల

చిత్త 3,4; స్వాతి,

విశాఖ 1,2,3 పాదాలు

సంతోషకరమైన వార్త వింటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగు తాయి. ధైర్యంగా ముందుకెడతారు. ఆదాయా నికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనసహా యం తగదు. గురువారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మీ చొరవతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. బాధ్యతల నుంచి తప్పు కుంటారు. పిల్లలకు శుభపరిణామాలున్నాయి.


వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ

వ్యవహారాల్లో ఒత్తిడికి గురి కావద్దు. ఉత్సాహంగా శ్రమించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఖర్చులధికమైనా ప్రయోజనకరం. శనివారం పనులు ఒక పట్టాన సాగవు. గృహమరమ్మతులు చేపడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. మీ చొరవతో ఒక శుభకార్యం నిశ్చయమవుతుంది. కొత్త పరిచయాలు లేర్పడతాయి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు.


ధనుస్సు

మూల, పూర్వాషాఢ,

ఉత్తరాషాఢ 1వ పాదం

కార్యసిద్థి, ధనలాభంఉన్నాయి. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. కొత్త పరి చయాలేర్పడతాయి. శుభకార్యం నిశ్చయమవు తుంది. కొత్త పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు, పత్రాల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు. మీ ఏమరు పాటుతనం ఇబ్బందులకు దారితీస్తుంది. పిల్లల విజయం సంతోషం కలిగిస్తుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.


మకరం

ఉత్తరాషాఢ 2,3,4;

శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు

సర్వత్రా అనుకూలదాయకం. దీక్షతో శ్రమించి లక్ష్యం సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఎంతటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటారు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆదాయం సంతృప్తికరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు.


కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. సలహాలు ఆశించవద్దు. వ్యతిరేకులు తప్పుదారి పట్టిస్తారు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పనులు చురు కుగా సాగుతాయి. గృహనిర్మాణం పూర్తవు తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ చొరవతో ఒకరికి లబ్థి చేకూరుతుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.


మీనం

పూర్వాభాద్ర 4వ

పాదం, ఉత్తరాభాద్ర, రేవతి

అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. చేపట్టిన పనులు ఆలస్యంగానైనా పూర్తి చేయగల్గు తారు. ఖర్చులు విపరీతం. రుణాలు,చేబదుళ్లు స్వీకరిస్తారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. శనివారం నాడు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పిల్లల భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి

పేరు రావాలన్నా పోవాలన్నా మీదే బాధ్యత

రైతులకు మహాప్రసాదం భూభారతి

చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

సోషల్‌ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త

వాట్ యాన్ ఐడియా సర్ జీ...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 20 , 2025 | 07:52 AM