Rudraksha: రుద్రాక్ష ధరించడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..
ABN , Publish Date - May 25 , 2025 | 06:10 PM
శివుని కన్నీటి నుండి పుట్టిన పవిత్ర రుద్రాక్ష ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఇవి 14 రకాల్లో లభిస్తాయి. ప్రతిదానికీ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అమావాస్య, పౌర్ణమి వంటి శుభ దినాలలో దీనిని ధరించడం శుభప్రదంగా ఉంటుంది.

Rudraksha Spiritual Benefits: శివుని రుద్రాక్ష.. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఈ రుద్రాక్ష శివుడి కన్నీటి నుండి పుట్టినదిగా చెబుతుంటారు. ఈ పవిత్ర రుద్రాక్ష ఎనలేని ఆధ్యాత్మిక శక్తి ఉంటుందని వేద పండితులు చెబుతుంటారు. ఆధ్యాత్మిక పండితుల ప్రకారం.. రుద్రాక్షలు 14 రకాల్లో లభిస్తాయి. ప్రతిదానికీ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ రుద్రాక్షను ధరించడం శుభప్రదంగా పేర్కొంటారు. రుద్రాక్షలు ఆరోగ్యం, శాంతి, ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని పెంచుతాయని నమ్మకం. రుద్రాక్షను శివ భక్తులే కాకుండా.. అందరూ ధరించొచ్చని.. అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని వేద నిపుణులు చెబుతున్నారు.
రుద్రాక్షలను ముఖాల సంఖ్య ఆధారంగా వర్గీకరిస్తారు. వీటిలో 14 రకాలు ఉన్నాయని చెబుతారు. ప్రతి రుద్రాక్షకు ప్రత్యేక శక్తులు ఉన్నాయని నమ్ముతారు. ముఖ్యంగా అమావాస్య, పౌర్ణమి, శ్రావణ మాసం, సోమవారం, ప్రదోష వ్రతాలలో రుద్రాక్ష ధరించడం శుభప్రదం అని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు..
ఈ రుద్రాక్ష శివ పూజలో ఎంతో కీలకమైంది. శివుని ఆరాధనకే కాకుండా, భక్తుల ఆధ్యాత్మిక జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకొస్తుంది. రుద్రాక్ష ధరించడం వలన ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు లభిస్తాయని.. వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. రుద్రాక్షలో ఉండే పదార్థాలు శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. అవి ఆందోళనను తగ్గించడానికి, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
శివుని ఆశీస్సులు..
రుద్రాక్షలు ధరించేవారిలో నూతనోత్తేజం ఉంటుందని.. ధైర్యం రెట్టింపవుతుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు. అంతేకాదు.. రుద్రాక్ష ధరించిన వారిపై శివుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయట. రుద్రాక్ష.. ఆధ్యాత్మిక శ్రేయస్సుకు కారణమవుతుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని కోరుకునేవారు.. రుద్రాక్షను ధరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతున్నారు. మానసిక శాంతిని, మనోస్థైర్యాన్ని ఇస్తుందని విశ్వాసం. పరమ శివుడిని ఆశీర్వాదం పొందాలనుకునే వారికి రుద్రాక్ష ఒక విలువైన నిధిగా పేర్కొంటున్నారు పండితులు.
Also Read:
రెజ్యూమ్ పంపమంటే.. ప్రేమ పైత్యం చూపించిన పోకిరీలు
ఆస్తమా రోగులు ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.. నిర్లక్ష్యం చేస్తే ఇన్హేలర్ కూడా పనిచేయదు..
For More Telugu News