Mystery Solved: భర్తను చంపి, ప్రియుడితో కేరళలో కాపురం..
ABN , Publish Date - Jul 30 , 2025 | 09:05 PM
Mystery Solved: నిగప్ప శవం కోసం వెతికారు. కానీ, శవం దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత తిప్పేశ్ కేరళకు వెళ్లి సెటిల్ అయ్యాడు. మరికొన్ని రోజుల తర్వాత లక్ష్మి కూడా కేరళ వెళ్లింది. వెళ్లేటప్పుడు కుటుంబసభ్యులకు ఎవ్వరికీ చెప్పలేదు.

ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను చంపి ఎంతో చాక చక్యంగా కేసు నుంచి తప్పించుంది. పోలీసులను తప్పు దోవ పట్టించింది. ప్రియుడితో కలిసి కేరళలో సెటిల్ అయింది. అయితే, ఆమె చేసిన చిన్న తప్పు కొంపముంచింది. ఇద్దరూ జైలు పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక.. హొన్నలి తాలూకా, త్యాగదాకట్టే గ్రామానికి చెందిన లక్ష్మి.. అన్నపుర గ్రామానికి చెందిన నిగప్ప భార్యాభర్తలు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లై ఎనిమిదేళ్లు అయినా భార్యాభర్తలకు పిల్లలు లేరు. గుళ్లకు, ఆస్పత్రులకు తిరిగినా ఇద్దరికీ పిల్లలు పుట్టలేదు. అయితే, ఓ రోజు ఓ దారుణమైన విషయం తెలిసింది. నిగప్పకు పిల్లలు పుట్టరన్న సంగతి బయటపడింది. ఈ నేపథ్యంలోనే నిగప్ప మిత్రుడు తిప్పేశ్ నాయక్‌తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచుగా కలుస్తూ ఉండేవారు. దీంతో లక్ష్మి గర్భం దాల్చింది. ఈ విషయం నిగప్పకు తెలిసింది. భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి అభార్షన్ చేయించాడు. భర్త చేసిన పనితో లక్ష్మి ఆగ్రహానికి గురైంది. భర్తను చంపడానికి ప్లాన్ చేసింది. 2024, జనవరి 18వ తేదీన లక్ష్మి, తిప్పేశ్ కలిసి నిగప్పను చంపేశారు. తర్వాత భద్రా కెనాల్‌లో పడేశారు. లక్ష్మి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. భర్త కాలు జారి కెనాల్‌లో పడిపోయాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నిగప్ప శవం కోసం వెతికారు. కానీ, శవం దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత తిప్పేశ్ కేరళకు వెళ్లి సెటిల్ అయ్యాడు. మరికొన్ని రోజుల తర్వాత లక్ష్మి కూడా కేరళ వెళ్లింది. వెళ్లేటప్పుడు కుటుంబసభ్యులకు ఎవ్వరికీ చెప్పలేదు. లక్ష్మి కనిపించకుండా పోవటంతో కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులకు లక్ష్మి మీద అనుమానం వచ్చింది. తిప్పేశ్ స్నేహితుడు సంతోష్‌ను స్టేషన్‌కు పిలిచి విచారించారు. అసలు విషయం బయటపడింది. దాదాపు సంవత్సరం తర్వాత పోలీసులు లక్ష్మి, తిప్పేశ్‌ను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
పహల్గామ్ ఉగ్రవాదుల హతం.. ఆ రాత్రి అమిత్ షా ఏం చేశారంటే..
రోజు రోజుకు పెచ్చు మీరుతున్న దర్శన్ ఫ్యాన్స్ ఆగడాలు..