Woman Plots Husbands Assasination: సోదరులతో కలిసి భర్త హత్యకు ప్లాన్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:03 PM
Woman Plots Husbands Assasination: సాధన తన భర్తను చంపాలనుకుంది. ఇందుకోసం తన సోదరుల సాయం తీసుకుంది. వారు ఓ ఆరుగురు గూండాలను రంగంలోకి దింపారు. మొత్తం 11 మంది కలిసి ఇంట్లో రాజీవ్‌పై దాడి చేశారు.

ఈ మధ్య కాలంలో భర్తలను చంపుతున్న భార్యల సంఖ్య బాగా పెరిగిపోయింది. దేశం ఈ మూలనుంచి ఆ మూల వరకు 70 శాతం కేసుల్లో వివాహేతర సంబంధాలే భర్తల హత్యకు కారణాలుగా నిలుస్తున్నాయి. అయితే, కొన్ని కేసుల్లో మాత్రం డబ్బులు, పగలు, ఆస్తి తగాదాలు, క్షణికావేశాలు కారణం అవుతున్నాయి. తాజాగా, ఓ మహిళ తన సోదరులతో కలిసి భర్త మర్డర్‌కు ప్లాన్ చేసింది. ఆ సోదరులు గూండాలతో కలిసి బావపై దాడి చేసి చావకొట్టారు. అడవికి తీసుకెళ్లి అక్కడ బతికుండాగానే పాతిపెట్టాలనుకున్నారు.
అక్కడే ఓ ట్విస్ట్ చోటుచేసుకుంది. దీంతో ఆ వ్యక్తి బతికిపోయాడు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ మొత్తం స్టోరీ చదవాల్సిందే. ఇక, సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, బరేలీకి చెందిన రాజీవ్, సాధన భార్యాభర్తలు. వీరికి 2009లో పెళ్లయింది. ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. పెళ్లయిన నాటి నుంచి సాధన భర్తతో తరచుగా గొడవలు పెట్టుకుంటూ ఉండేది. ఆమెకు గ్రామంలో ఉండటం ఇష్టం లేదు. దీంతో సిటీకి వచ్చి సెటిల్ అయ్యారు.
రాజీవ్ ఓ డాక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సాధన తన భర్తను చంపాలనుకుంది. ఇందుకోసం తన సోదరుల సాయం తీసుకుంది. వారు ఓ ఆరుగురు గూండాలను రంగంలోకి దింపారు. మొత్తం 11 మంది కలిసి ఇంట్లో రాజీవ్‌పై దాడి చేశారు. అతడి కాళ్లు, చేతులు ఇరగ్గొట్టారు. తర్వాత అతడ్ని అడవిలోకి తీసుకువచ్చారు. బతికుండగానే రాజీవ్‌ను పూడ్చేయాలని అనుకున్నారు.
ఇందుకోసం గొయ్యి కూడా తీశారు. అయితే, రాజీవ్‌ను పూడ్చిపెట్టే సమయంలో ఓ వ్యక్తి అటువైపు వచ్చాడు. అతడ్ని చూడగానే 11 మంది అక్కడినుంచి పారిపోయారు. ఆ వ్యక్తి గాయాలతో ఉన్న రాజీవ్‌ను అంబులెన్స్ సాయంతో ఆస్పత్రిలో చేర్చాడు. రాజీవ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి
మీరసలు తల్లిదండ్రులేనా.. కన్న కొడుకును అలా వదిలేసి పోతారా?
మానవత్వం మరిచిన పోలీస్.. మరీ ఇంత దారుణమా..