Share News

Unemployed Engineer: భార్య షాపింగ్‌కు వెళ్లిందని చంపేశాడు..

ABN , Publish Date - Jul 10 , 2025 | 10:31 AM

Unemployed Engineer: కొన్ని నెలల క్రితం హరీశ్ ఉద్యోగం మానేశాడు. ఇంటికే పరిమితం అయ్యాడు. అతని భార్య పూజ ఉద్యోగం చేస్తోంది. ఆర్థికపరమైన విషయాల్లో ఇద్దరికీ గొడవలు జరుగుతూ ఉన్నాయి.

Unemployed Engineer: భార్య షాపింగ్‌కు వెళ్లిందని చంపేశాడు..
Unemployed Engineer

ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తల మధ్య బంధాలు నానాటికి పలుచబడిపోతున్నాయి. చిన్నచిన్న గొడవలతో భాగస్వామి ప్రాణాలు తీస్తున్న వారు ఎక్కువైపోయారు. తాజాగా, షాపింగ్‌కు వెళ్లిందని ఓ వ్యక్తి తన భార్యతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ సందర్భంగా కాలితో భార్య గొంతునొక్కి చంపేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని బొమ్మనహళ్లి ప్రాంతానికి చెందిన హరీశ్, పూజ భార్యాభర్తలు. ఇద్దరూ బీఈ చదివారు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు.


కొన్ని నెలల క్రితం హరీశ్ ఉద్యోగం మానేశాడు. ఇంటికే పరిమితం అయ్యాడు. పూజ ఉద్యోగం చేస్తూ ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఇద్దరికీ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం పూజ షాపింగ్‌కు వెళ్లింది. తనకు కావాల్సిన వస్తువుల్ని కొనుక్కుని ఇంటికి వచ్చింది. పూజ షాపింగ్‌కు వెళ్లిందని తెలిసి హరీశ్ ఫైర్ అయ్యాడు. ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. మాటకు మాట సమాధానం ఇస్తుండటంతో హరీశ్ తట్టుకోలేకపోయాడు.


మాటలు వదిలేసి చేతులకు పని చెప్పాడు. ఆమెను కొట్టి నేలపై పడేశాడు. అనంతరం కాలితో ఆమె గొంతునొక్కి చంపేశాడు. పూజ మర్డర్ గురించి పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పూజ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భార్యను హత్య చేసిన హరీశ్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఉత్తర భారతదేశంలో పలు చోట్ల భూప్రకంపనలు

రీల్స్ పిచ్చి.. గన్నుతో హైవేపై హల్‌చల్ చేసిన మహిళ..

Updated Date - Jul 10 , 2025 | 01:45 PM