Chennai: మాజీసీఎం భద్రతా విభాగంలో పనిచేసిన రిటైర్డ్ ఎస్‌ఐ దారుణహత్య
ABN , Publish Date - Mar 19 , 2025 | 11:39 AM
మాజీ ముఖ్యమంత్రి భద్రతా విభాగంలో ఎస్సైగా పనిచేసిన అధికారి దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా సంచలనానికి దారితీసింది. అయితే.. ఈ హత్యపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Karunanidhi) భద్రతా విభాగంలో ఎస్‌ఐగా పనిచేసిన జాకీర్‌హుస్సేన్ (57) మంగళవారం ఉదయం దారుణహత్యకు గురయ్యారు. రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా దర్గాకు వెళ్ళి నమాజు చేసి ఇంటికి తిరిగి వెళ్తున్న జాకీర్ హుస్సేన్‌ను బైకుపై వచ్చిన ముగ్గురు వేటకొడవళ్లతో దాడిచేసి దారుణంగా హతమార్చారు. దుండగుల బారి నుండి తప్పించుకునేందుకు జాకీర్ హుస్సేన్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దుండగులు జాకీర్ హుస్సేన్ తలపై కత్తులతో దాడి జరిపి మెరుపువేగంతో పారిపోయారు.
ఈ వార్తను కూడా చదవండి: Electricity Department: విద్యుత్ శాఖ షాకింగ్ డెసిషన్.. వేల కనెక్షన్లు కట్..
అది చూసిన కొందరు పాదచారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ గోపాలకృష్ణన్ తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ స్థలం వివాదం కారణంగా ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. తొట్టిపాళం మెయిన్ రోడ్డులో 36 సెంట్ల భూమికి సంబంధించి జాకీర్‌హుస్సేన్‌కు అదే ప్రాంతానికి చెందిన ముస్లింయువతిని వివాహమాడిన ఎస్సీ కులానికి చెందిన వ్యక్తికి మధ్య పాత తగదాలున్నాయి.
ఆ నేపథ్యంలో జాకీర్‌హుస్సేన్‌పై ఆ వ్యక్తి ఫిర్యాదు మేరకు అంటరానితనం నిరోధక చట్టం కింద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీంతో వారి మధ్య కక్షలు పెరిగాయి. ఆ నేపథ్యంలో జాకీర్‌హుస్సేన్‌ను హతమార్చి ఉంటారని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ హత్యకు సంబంధించిన అక్బర్‌బాషా, తవఫీక్ అనే ఇద్దరు తిరునల్వేలి కోర్టులో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. హత్యా ప్రాంతం వద్దనున్న సీసీ ఫుటేజీ ఆధారంగా మరో హంతకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?
కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు
రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది
పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు
Read Latest Telangana News and National News