Share News

Punjab Land Dispute: తమ్ముడిపై పగబట్టి.. కారుతో కుటుంబం మొత్తాన్ని..

ABN , Publish Date - Jul 18 , 2025 | 09:34 AM

Punjab Land Dispute: బల్విందర్ తల్లిదండ్రులకు ఆశ్రయం ఇవ్వటం దిల్‌బాగ్ సింగ్‌కు నచ్చలేదు. తమ్ముడిపై పగ పెంచుకున్నాడు. జులై 14వ తేదీన దిల్‌బాగ్ తన భార్యతో కలిసి కారులో వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో బల్విందర్ సింగ్ తన కూతురు, భార్యతో కలిసి ఓ చోట నిలబడి ఉన్నాడు.

Punjab Land Dispute: తమ్ముడిపై పగబట్టి.. కారుతో కుటుంబం మొత్తాన్ని..
Punjab Land Dispute

ఆస్తి గొడవ అన్నదమ్ముల్ని శత్రువుల్లా మార్చేసింది. చంపుకునే వరకు తీసుకెళ్లింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన తమ్ముడి కుటుంబాన్ని కారుతో ఢీకొట్టాడు. కారు ఢీకొట్టిన వేగానికి కుటుంబం మొత్తం గాల్లోకి ఎగిరి దూరంగా పడిపోయింది. అందరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన పంజాబ్‌లోని మోగ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గట్టి జట్ట గ్రామానికి చెందిన సుర్జీత్ సింగ్‌కు ముగ్గురు కుమారులు. వారికి పెళ్లిళ్లు అయి వేరు వేరుగా ఉంటున్నారు. సుర్జీత్ తన భార్యతో కలిసి దిల్‌బాగ్ సింగ్‌ దగ్గర ఉండేవాడు.


అయితే, ఆస్తి తగాదాల నేపథ్యంలో దిల్‌బాగ్ తన తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి బయటకు నెట్టేశాడు. దీంతో వారు చిన్న కొడుకు బల్విందర్ సింగ్ దగ్గర ఉంటున్నారు. బల్విందర్ తల్లిదండ్రులకు ఆశ్రయం ఇవ్వటం దిల్‌బాగ్ సింగ్‌కు నచ్చలేదు. తమ్ముడిపై పగ పెంచుకున్నాడు. జులై 14వ తేదీన దిల్‌బాగ్ తన భార్యతో కలిసి కారులో వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో బల్విందర్ సింగ్ తన కూతురు, భార్యతో కలిసి ఓ చోట నిలబడి ఉన్నాడు. వారిని చూడగానే దిల్‌బాగ్ కోపం కట్టలుతెంచుకుంది.


భార్యను కారులోంచి కిందకు దించాడు. తర్వాత కారును అతి వేగంగా తమ్ముడి కుటుంబం వైపు పోనిచ్చాడు. వారిని ఢీ కొట్టాడు. కారు ఢీకొన్న వేగానికి ముగ్గురు గాల్లోకి ఎగిరిపడ్డారు. బల్విందర్ కూతురు కారు కింద చిక్కుకుపోయింది. వారి అరుపులు విన్న జనం అక్కడికి పరుగున వచ్చారు. ముగ్గుర్ని ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

వర్షాకాలం.. ఈ కూరగాయలు తినే ముందు 100 సార్లు ఆలోచించండి..!

తెలుగు రాష్ట్రాలకు ఐఎమ్‌డీ హెచ్చరిక.. వారం రోజులు భారీ వర్షాలు..

Updated Date - Jul 18 , 2025 | 09:43 AM