Instagram: నేను మరణాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నా...
ABN , Publish Date - Jan 22 , 2025 | 10:24 AM
‘నేను మరణాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నా’ అని ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పోస్టు పెట్టిన యువకుడు అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని నరసాపురం(Narasapuram) మండలం, కేశవంపేట్‌కు చెందిన చింతల పవన్ మణికంఠ(19) కేపీహెచ్‌బీ కాలనీ(KPHB Colony)లో హాస్టల్ ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు.

- ఇన్‌స్టాగ్రాంలో పోస్టు... యువకుడి అదృశ్యం
హైదరాబాద్: ‘నేను మరణాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నా’ అని ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో పోస్టు పెట్టిన యువకుడు అదృశ్యమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఏపీలోని నరసాపురం(Narasapuram) మండలం, కేశవంపేట్‌కు చెందిన చింతల పవన్ మణికంఠ(19) కేపీహెచ్‌బీ కాలనీ(KPHB Colony)లో హాస్టల్ ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడు. సంక్రాంతి పండుగ(Sankranti festival) కు సొంతూరు వెళ్లిన అతడు సోమవారం రాత్రి హైదరాబాద్(Hyderabad)కు బయలుదేరాడు. మంగళవారం తెల్లవారుజామున హాస్టల్‌కు చేరుకున్నట్టు తల్లిదండ్రులకు ఫోన్‌చేసి చెప్పాడు. అనంతరం వారు ఫోన్‌చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. మియాపూర్‌లోనే ఉంటున్న బంధువుకు తల్లిదండ్రులు ఫోన్‌చేసి విషయం చెప్పగా అతడు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ ప్రభుత్వానిది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక పాలనే
ఈవార్తను కూడా చదవండి: Bandi Sanjay: రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెరగాలి
ఈవార్తను కూడా చదవండి: Illegal Kidney Transplants: కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు!
Read Latest Telangana News and National News