Haryana Man Attacked before Marriage: కాబోయే భర్తపై ప్రియుడితో దాడి చేయించిన యువతి.. కోమాలో బాధితుడు
ABN , Publish Date - Apr 19 , 2025 | 04:30 PM
పెళ్లికి రెండు రోజులు ఉందనగా హర్యానా యువతి తనకు కాబోయే భర్తపై ప్రియుడితో దాడి చేయించడంతో బాధితుడు కోమాలోకి వెళ్లాడు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు రోజుల్లో అతడి పెళ్లి. కుటుంబం అంతా సంతోషంగా ఉంది. ఇలాంటి సమయంలో జరిగిన దారుణం ఆ కుటుంబాన్ని షాక్‌కు గురి చేసింది. యువకుడికి కాబోయే భార్య చేసిన దారుణంతో బాధితుడు కోమాలోకి వెళ్లిపోయాడు. అతడి పరిస్థితి క్రిటికల్‌గా ఉండటంతో వైద్యులు అతడికి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేస్తున్నారు. హర్యాయాలో వెలుగు చూసిన ఈ షాకింగ్ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఫరీదాబాద్‌కు చెందిన గౌరవ్ అనే 28 ఏళ్ల వ్యక్తి ఐటీఐ టీచర్‌గా పని చేస్తున్నాడు. ఏప్రిల్ 17న అతడికి కాబోయే భార్య ప్రియుడు తన స్నేహితుడు సోనూతో కలిసి దారుణం కొట్టాడు. కర్రలు, బేస్‌బాల్ బ్యాట్‌లతో దాడి చేయడంతో తీవ్ర గాయాల పాలైన అతడు కోమాలోకి వెళ్లిపోయాడు. కర్రలు, బ్యాట్‌లతో ఇష్టారీతిన కొట్టడంతో గౌరవ్ రెండు కాళ్లు, చేయి, ముక్కు విరిగిపోయాయని తెలిపారు. నెత్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
గౌరవ్‌కు కాబోయే భార్య నేహ ఈ దాడి చేయించిందని అన్నారు. దాడి తరువాత గౌరవ్ తమకు ఫోన్ చేసి ఈ దారుణానికి కారకులెవరో చెప్పాడని అన్నారు. సౌరవ్ అతడికి ఓ ఫోటో చూపించాడని, నేహానే ఈ దాడి చేయమని స్పష్టమైన సూచనలు ఇచ్చిన విషయాన్ని చెప్పాడని గౌరవ్ తమతో అన్నట్టు పేర్కొన్నారు. ‘‘గౌరవ్‌కు కాబోయే భార్యే అతడిపై తన ప్రియుడు సౌరవ్‌ను ఉసిగొల్పింది. ఇప్పుడు గౌరవ్ కోమాలో ఉన్నాడు’’ అని బాధితుడు బంధువు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గౌరవ్, నేహల నిశ్చితార్థం ఏప్రిల్ 15న జరిగిందని అతడి కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఆ సమయంలో నేహ కుటుంబసభ్యులు గౌరవ్‌కు ఓ బంగారు ఉంగరం, చెయిన్ ఇచ్చారని అన్నారు. దాడి సమయంలో వీటిని సౌరవ్ గౌరవ్ వద్ద నుంచి తీసేసుకున్నాడని, వాటికి గౌరవ్ అనర్హుడని అన్నాడని తెలిపారు.
అంతకుముందే, సౌరవ్ ఈ పెళ్లికి అభ్యంతరం చెబుతూ గౌరవ్‌న బెదిరించాడు. ఆ తరువాత గౌరవ్ తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సౌరవ్ క్షమాపణలు చెప్పడంతో విషయం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇక పెళ్లికి రెండు రోజులు ఉందనంగా సౌరవ్ దాడికి తెగబడటంతో గౌరవ్ ఏకంగా కోమాలోకి వెళ్లిపోయాడు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు సదర్ బల్లభ్‌గఢ్ స్టేషన్ పోలీసులు తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
ఐసీయూలో ఎయిర్‌హోస్టస్‌పై అత్యాచారం.. ఎట్టకేలకు పోలీసుల అదుపులో నిందితుడు
మాజీ బాయ్‌ఫ్రెండే కాబోయే మామగారు.. యువతి లైఫ్‌లో వింత ట్విస్ట్
తల్లి హృదయం ఎంత గొప్పది.. చిరుత దాడిలో గాయపడ్డా లెక్క చేయక ఈ తల్లి శునకం..