Share News

Coimbatore: భార్యను చంపి సెల్ఫీ దిగిన భర్త.. వంచనకు మూల్యమని స్టేటస్‌లో పోస్ట్

ABN , Publish Date - Nov 30 , 2025 | 08:33 PM

శ్రీప్రియకు మరో వ్యక్తితో సంబంధం ఉందని బలరాం కొద్దికాలంగా అనుమానిస్తున్నాడు. సంఘటన జరిగిన రోజున బాలమురన్ హాస్టల్‌కు వెళ్లి ఆమెను తనతో రమ్మని కోరాడు.

Coimbatore: భార్యను చంపి సెల్ఫీ దిగిన భర్త.. వంచనకు మూల్యమని స్టేటస్‌లో పోస్ట్
Coimbatore man kills wife

కోయంబత్తూరు: వివాహేతర సంబంధం సాగిస్తోందని భార్యను అనుమానించిన భర్త ఆమెను అత్యంత కిరాతంగా నరికి చంపాడు. పోలీసులు వచ్చేంత వరకూ అక్కడే వేచి ఉన్నాడు. మృతదేహంతో సెల్ఫీ దిగి ఆ ఫోటోను తన స్టేటస్‌లో పోస్ట్ చేశాడు. గగుర్పాటు కలిగించే ఈ ఘటన కోయంబత్తూరులో ఆదివారంనాడు జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం, తిరునల్వేలికి చెందిన బాలమురుగన్ కొద్ది కాలం క్రితం శ్రీప్రియను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం. శ్రీప్రియ వ్యక్తిగత కారణాలతో భర్తకు దూరంగా ఉంటోంది. కోయంబత్తూరులోని ఉమెన్స్ హాస్టల్‌లో పనిచేస్తూ అక్కడే ఉంటోంది. శ్రీప్రియకు మరో వ్యక్తితో సంబంధం ఉందని బలరాం కొద్దికాలంగా అనుమానిస్తున్నాడు. సంఘటన జరిగిన రోజున బాలమురన్ హాస్టల్‌కు వెళ్లి ఆమెను తనతో రమ్మని కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో ముందుగానే తనతో తెచ్చుకున్న కొడవలితో ఆమెపై బాలమురుగన్ దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.


హత్యానంతరం తన భార్య మృతదేహం పక్కనే పోలీసులు వచ్చేంత బాలమురుగన్ ఉండిపోయాడు. భార్య శవంతో సెల్ఫీ దిగి దానిని తన స్టాటస్‌లో పోస్ట్ చేశాడు. 'వంచనకు మరణమే మూల్యం' అంటూ దానికి క్యాప్షన్ పెట్టాడు. రత్నపురి పోలీసులు బాలమురుగన్‌ను అరెస్టు కేసు విచారణ జరుపుతున్నారు.

Updated Date - Nov 30 , 2025 | 08:42 PM