Share News

Kerala Story: భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టింది.. అడిగితే కేరళ స్టోరీ చెప్పింది..

ABN , Publish Date - Jul 15 , 2025 | 01:16 PM

Kerala Story: జనానికి ఆమె మీద అనుమానం మరింత పెరిగింది. జులై 12వ తేదీన హతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం పరారీలో ఉన్న రహిమాకు తెలిసింది.

Kerala Story: భర్తను చంపి ఇంట్లోనే పాతి పెట్టింది.. అడిగితే కేరళ స్టోరీ చెప్పింది..
Kerala Story

భార్యా భర్తల మధ్య గొడవ ఓ నిండు ప్రాణం తీసింది. ఓ భార్య భర్తను హత్య చేసి.. ఇంట్లోనే పాతిపెట్టింది. కేసు నుంచి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నించింది. చివరకు తనంతటతానే స్టేషన్‌లో లొంగిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అస్సాం, గువహటిలోని పండు ఏరియాకు చెందిన సబియల్ రెహ్మాన్, రహిమా ఖాతూన్ భార్యాభర్తలు. వీరికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత కొంత కాలంనుంచి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జూన్ 26వ తేదీన కూడా ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. గొడవ సందర్భంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. రెహ్మాన్ తాగి ఉండటంతో భార్యతో సరిగా గొడవపడలేకపోయాడు. బాగా దెబ్బలు తిన్నాడు.


దెబ్బల కారణంగా ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. భర్త చనిపోవటంతో రహిమా భయపడిపోయింది. ఇంట్లో 5 అడుగుల గొయ్యి తీసి భర్త శవాన్ని దాంట్లో వేసి పూడ్చేసింది. మరుసటి రోజునుంచి ఏం జరగనట్లు అందరితో మామూలుగా ఉండటం మొదలెట్టింది. రెహ్మాన్ కనిపించకపోవటంతో పోరిగింటి వాళ్లు అతడి గురించి రహిమాను ఆరా తీశారు. పని మీద కేరళకు వెళ్లాడని చెప్పింది. అయితే, పొరిగిళ్ల వారు ఆమె మాటల్ని నమ్మలేదు. వారికి తనమీద అనుమానం వచ్చిందని రహిమా గ్రహించింది.


తనకు ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రికి వెళుతున్నానని చెప్పి ఊరు విడిచి పారిపోయింది. దీంతో జనానికి ఆమె మీద అనుమానం మరింత పెరిగింది. జులై 12వ తేదీన హతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం పరారీలో ఉన్న రహిమాకు తెలిసింది. పోలీసులు తనను ఎలాగైనా పట్టుకుంటారని ఆమె భావించింది. జులై 13వ తేదీన జలుక్‌బరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. చేసిన నేరం ఒప్పుకుంది. వైవాహిక జీవితంలో గొడవల వల్లే హత్య జరిగిందని చెప్పింది. అయితే, పోలీసులు ఆమె మాటలు నమ్మటం లేదు. ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ‘ఓ లేడీ ఐదు అడుగుల గొయ్యి తవ్వి, మనిషిని పాతి పెట్టడం అసాధ్యం. ఆమెకు ఎవరో సాయం చేశారు. మేము వారెవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

ఇండియన్స్ అంటే అంత చిన్న చూపా.. అంత దారుణంగా అంటారా?..

ఇంట్లో అస్థిపంజరం.. Nokia ఫోన్‌తో కనిపెట్టారు!

Updated Date - Jul 15 , 2025 | 01:28 PM